News August 9, 2024
రామకృష్ణాపురం క్వారీ చెరువులో పడి వ్యక్తి మృతి

ఆరిలోవ శివారు ప్రాంతం రామకృష్ణాపురంలో క్వారీ చెరువులో పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం కొందరు వ్యక్తులు గంజాయి తాగి అటుగా వెళుతున్న బ్లూ కోర్ట్ పోలీసులను చూసి పరుగులు తీసి చెల్లాచెదురయ్యారు. ఈ నేపథ్యంలో చెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమయింది. మృతుడు హెచ్బీ కాలనీకి చెందిన సాయినాథ్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 19, 2025
పద్మనాభంలో స్వామి ఉత్సవం ఎలా ప్రారంభమైంది?

పద్మనాభంలోని గిరి ప్రాంతంలో 1938లో విజయనగరం పాలకుడు పూసపాటి అలక్ నారాయణ గజపతి ఆనతి మేరకు ద్రాక్షారామం నుంచి వచ్చిన చేకూరి, బుల్లి సత్యనారాయణరాజు ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. త్రిపుర సుందరీదేవి విగ్రహాన్ని తీసుకువచ్చి యజ్ఞాలు నిర్వహించేవారు. ఆఖరిరోజు అనంతుని కొండ మెట్ల పంక్తికి దీపోత్సవాన్ని నిర్వహించేవారు. కొంతకాలం ఉత్సవం నిలిచినా..1987లో ఆలయ అర్చకుడు కృష్ణమాచార్యుల సూచనల మేరకు పునఃప్రారంభించారు.
News November 19, 2025
ఉత్తరాంధ్రలో అంచనాల కమిటీ పర్యటన

AP అంచనాల కమిటీ ఈనెల 25-29 వరకు ఉత్తరాంధ్రలో పర్యటించనుంది. ఛైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన కమిటీ సభ్యులు 25న విశాఖ చేరుకుంటారు. 26న సింహాచలంలో స్వామిని దర్శనం చేసుకొని.. దేవాదాయ శాఖ అధికారులతో సమావేశమౌతారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో చర్చించనున్నారు. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన పనులకు సంబంధించిన అంశాలపై సమీక్షిస్తారు.
News November 19, 2025
విశాఖ కమీషనరేట్లో వెయిటింగ్ హాల్ ప్రారంభం

విశాఖ నగర పోలీసు కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి కమీషనరేట్లో కొత్తగా ఏర్పాటు చేసిన సందర్శకుల వెయిటింగ్ హాల్ను ప్రారంభించారు. కమిషనర్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు హాల్ సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు తదితర అధికారులు పాల్గొన్నారు.


