News March 22, 2025
రామకృష్ణాపూర్లో శ్రీకాంత్ సూసైడ్.. UPDATE

రామకృష్ణాపూర్లో <<15839741>>శ్రీకాంత్ <<>>ఉరేసుకుని సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఎస్ఐ రాజశేఖర్ వివరాలు.. పట్టణానికి చెందిన శ్రీకాంత్ ఓ కన్స్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, కంపెనీలోని ఆర్థిక లావాదేవీలలో ముగ్గురు తనను వేధిస్తున్నారంటూ సూసైట్ నోట్ రాసి ఇంట్లో ఉరేసుకున్నాడు. శుక్రవారం కుటుంబ సభ్యులు తలుపు తెరచి చూడగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కేసు నమోదైంది.
Similar News
News November 25, 2025
బలవంతపు వాంతులతో క్యాన్సర్: వైద్యులు

బ్రష్ చేశాక చాలా మంది గొంతులోకి వేళ్లు పెట్టి బలవంతంగా వాంతులు చేసుకుంటారు. అలా పదే పదే చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘కడుపులోని యాసిడ్ పదేపదే పైకి తన్నడం వల్ల అన్నవాహికలోని ‘టైల్స్’ లాంటి సున్నితమైన కణాలు అరిగిపోతాయి. ఇలా మాటిమాటికీ జరిగితే తీవ్రమైన సందర్భాల్లో క్యాన్సర్ కణాలుగా మారే ప్రమాదం ఉంటుంది. నాలుకను గీసుకొని ముఖం కడుక్కుంటే చాలు’ అని సూచించారు.
News November 25, 2025
5న తిరుమల దర్శనం టికెట్ల విడుదల

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి TTD కీలక ప్రకటన వెలువరించింది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 15000 చొప్పున రూ.300 టికెట్లు ఇస్తామని తెలిపింది. డిసెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు ఆన్లైన్లో టికెట్లను విడుదల చేస్తామని వెల్లడించింది. ఆరోజు టీటీడీ వెబ్సైట్ ద్వారానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలని సూచించింది.
News November 25, 2025
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడిందని, రాబోయే 24 గంటల్లో ఇది బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మరోవైపు మలక్కా జలసంధి వద్ద కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని పేర్కొంది. వీటి ప్రభావంతో NOV 29 నుంచి DEC 2 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.


