News March 17, 2025
రామగిరి ఎస్సై సుధాకర్ ఇన్‌స్టా పోస్టు వైరల్

రామగిరి ఎస్ఐ సుధాకర్ చేసిన ఓ పోస్ట్ వైరలవుతోంది. ‘మా నాన్న జాగీర్లు ఇవ్వలేదు. కానీ ఎవరికీ తలవంచని ధైర్యం ఇచ్చారు’ అంటూ ఆయన తన తండ్రితో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. కాగా.. ఇటీవల రామగిరి ఎస్ఐపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ‘పోలీస్ స్టేషన్ ఏమైనా నీ అయ్య జాగీరా?’ అని ఎస్ఐను ప్రశ్నించారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలోనే ఎస్ఐ తాజా పోస్ట్ వైరలవుతోంది.
Similar News
News April 22, 2025
HYDలో SRనగర్ CI ది గ్రేట్

రూల్స్ ఫాలో అవకపోతే ట్రాఫిక్ పోలీసులు ఎంత కఠినంగా ఉంటారో తెలిసిందే. నగరవాసులకు ఆపద వస్తే మాత్రం అంతకుమించి మానవత్వం చూపిస్తారు. అలాంటి ఘటనే మన SRనగర్లో జరిగింది. ఉమేశ్ చంద్ర విగ్రహం వద్ద సోమవారం ఓ మైనర్ వాహనం నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. విధుల్లో ఉన్న CI సైదులు ఇది గమనించాడు. బాలుడిని పైకి లేపి FIRST AID చేశారు. ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించారు. బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి, ఇంటికి పంపారు.
News April 22, 2025
పోప్ డెత్ రిపోర్ట్‌లో ఏముందంటే?

పోప్ ఫ్రాన్సిస్ నిన్న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. గుండెపోటుతోనే ఆయన మృతిచెందినట్లు వాటికన్ డాక్టర్ ఆండ్రియా విడుదల చేసిన డెత్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. చనిపోయేముందు ఆయన కోమాలోకి వెళ్లినట్లు తెలిపారు. కాగా శుక్రవారం లేదా ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం. ఎలాంటి ఆడంబరం లేకుండా మట్టిలో పూడ్చాలని, ఇన్‌స్క్రిప్షన్‌పై తన పేరును లాటిన్ భాషలో రాయాలని ఆయన ముందుగానే చెప్పినట్లు తెలుస్తోంది.
News April 22, 2025
జన సమీకరణలో బిజీ.. బిజీ

27న వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి ఖమ్మం నుంచి 50 నుంచి 60 వేల మందిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. MP రవిచంద్ర, MLC తాతా మధుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జులగా ఉన్నారు. జనసమీకరణలో వారు బీజీ అయ్యారు. MLC కవిత నేతలతో సమామేశమై సభకు జనాన్ని భారీగా తరలించాలని దిశ నిర్దేశం చేశారు. అధికార పార్టీ బలాన్ని అధిగమించి వీరు ఎంతవరకు జన సమీకరణ చేస్తారనేది ఆసక్తి నెలకొంది.