News April 7, 2025

రామగిరి హెలిప్యాడ్ వద్ద భద్రత సిబ్బంది తనిఖీలు

image

రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈనెల 8వ తేదీన పరామర్శించనున్నారు. ఉదయం 10.00 గంటలకు రామగిరి మండలం కుంటిమద్ది వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లికి బయలుదేరుతారు. ఈ నేపథ్యంలో మంగళవారం హెలిప్యాడ్ వద్ద భద్రత సిబ్బంది పరిశీలించారు.

Similar News

News April 17, 2025

ధర్మవరం రూట్‌లో పనులు.. పలు రైళ్లు రద్దు

image

ధర్మవరం రైల్వే స్టేషన్‌లో పుట్టపుర్తి-తిరుపతి కనెక్షన్ పాయింట్స్, పాయింట్ ఛేంజింగ్ పనులు బుధవారం మొదలయ్యాయి. దీంతో గుంతకల్లు-తిరుపతి, తిరుపతి-కదిరిదేవరపల్లి ప్యాసింజర్ రైళ్లు బుధవారం నుంచి మే 17వరకు రద్దయ్యాయి. ఈ మార్గంలో వెళ్లే మరిన్ని రైళ్లను గుత్తి మీదుగా రేణిగుంటకు మళ్లించారు. ఇక నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ కదిరి-నర్సాపూర్‌ మధ్య రాకపోకలు సాగించనుంది.

News April 17, 2025

ATP: గ్రామస్థాయిలో సమస్యలను పరిష్కరించాలి- కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సంక్లిష్టమైన అర్జీలను వదిలిపెట్టకుండా నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం గుంతకల్లు రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామస్థాయిలో నాణ్యతగా సమస్యలను పరిష్కరించాలన్నారు. వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.

News April 17, 2025

‘ఏపీ ప్రభుత్వం వాట్సాప్ సేవలు ఉపయోగించుకోవాలి’

image

ఏపీ ప్రభుత్వం వాట్సాప్ సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ సేవలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి మన మిత్ర (వాట్సాప్ గవర్నెన్స్) 95523 00009 కు హాయ్ అనండి… హాయిగా సేవలు పొందాలన్నారు.

error: Content is protected !!