News February 13, 2026
రామగుండంలో కాంగ్రెస్ జోరు.. 34 స్థానాల్లో ఆధిక్యం!

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కాంగ్రెస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. మొత్తం 60 డివిజన్లలో కాంగ్రెస్ 34 స్థానాల్లో ముందంజలో ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, ఫలితాల సరళిని బట్టి పార్టీ శ్రేణులు ఇప్పటికే సంబరాలు మొదలుపెట్టాయి.
Similar News
News March 15, 2026
రేపు బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో PGRS

జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు గతంలో వచ్చిన అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం జరుగుతుంది. అనంతరం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. ఫిర్యాదుల వివరాలు తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్ 1100కు కాల్ చేయవచ్చని అన్నారు.
News March 15, 2026
శ్రీరామనవమి నాడు ‘భద్రగిరి గిరిజన మార్ట్’ ప్రారంభం

గిరిజన మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా శ్రీరామనవమి నాడు భద్రగిరి మార్ట్ ప్రారంభించనున్నట్లు APO డేవిడ్ రాజ్ వెల్లడించారు. ఆదివారం స్థానిక వ్యాపారులతో మాట్లాడుతూ.. మార్ట్ విజయవంతానికి వ్యాపారులు తమ సలహాలు, సూచనలు అందించాలని, ప్రజలకు నిత్యం అవసరమయ్యే సరుకుల జాబితాను సిద్ధం చేయాలని కోరారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తూనే, నాణ్యమైన వస్తువులను అందుబాటులో ఉంచుతామన్నారు.
News March 15, 2026
వలిగొండ: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

వలిగొండ-తిరుమలగిరి ప్రధాన రహదారిపై యాదాద్రి జిల్లా అరూరు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు ప్రారంభించారు.


