News February 19, 2025
రామగుండంలో చర్చలు విఫలం

రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ సమక్షంలో రామగుండం రీజియన్లోని ఓబీ కంపెనీల కాంట్రాక్టర్లకు, కాంట్రాక్టు కార్మికులకు మధ్యన జరిగిన చర్చలు వాయిదా పడ్డాయి. వేతనాలు కనీసం రూ.6 వేలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేయగా రూ.2 వేలు పెంచుతామని కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. కాగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న కార్మికులకు కనీసం రూ.4 వేలు పెంచాలని ఎమ్మెల్యే సూచించారు.
Similar News
News September 19, 2025
శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్గా రాజంపేట వాసి

శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్గా రాజంపేట పట్టణం వైబిఎన్ పల్లెకు చెందిన పోతుగుంట రమేశ్ నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
News September 19, 2025
తెలంగాణ బొగ్గు బ్లాక్లను ఈ ఆక్షన్లో చేర్చాలి

సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్న జాదవ్ ఢిల్లీలోని బొగ్గు గనుల మంత్రిత్వశాఖలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అక్టోబర్ 2025లో జరగే బొగ్గు బ్లాక్ ఈ-ఆక్షన్ ప్రక్రియపై సింగరేణి సంస్థ తరఫున తెలంగాణ ప్రాంతంలోని బొగ్గు బ్లాక్లను ఈ-ఆక్షన్ జాబితాలో చేర్చాలని కోరారు. ఈ సమావేశంలో మళ్లీ ప్రస్తావించారు. సింగరేణి సంస్థకు మాత్రమే కాకుండా రాష్ట్రానికి, దేశానికి ప్రయోజనం కలుగుతుందన్నారు.
News September 19, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.