News April 10, 2025

రామగుండంలో భూకంపం?

image

ఇటీవల వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం బ్యాంకాక్, మయన్మార్‌ దేశాల్లో భూకంపం దాటికి భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. అయితే, రామగుండంలో ఏప్రిల్ 10-17 మధ్య భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నట్లు Epic (Earthquake Research & Analysis) తెలిపింది. తమ పరిశోధన, విశ్లేషణ ప్రకారం రామగుండంలో భూకంపం సంభవించే అవకాశం ఉందని ట్విట్టర్‌లో పేర్కొంది.

Similar News

News March 7, 2026

మృత్యుంజయ స్వామిని దర్శించుకున్న జడ్జి అరుణ

image

చిత్తూరు జిల్లా జడ్జి అరుణ సారిక శనివారం చౌడేపల్లి మండలంలోని పలు దేవాలయాలను సందర్శించారు. తొలుత స్థానిక శివాలయంలో మృత్యుంజయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన బోయకొండ గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. శివాలయంలో అర్చకులు, బోయకొండలో ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం న్యాయమూర్తిని సాదరంగా ఆహ్వానించి స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించారు.

News March 7, 2026

‘విజయ’ బ్రాండ్‌తో కల్తీ.. AP డెయిరీపై ఆరోపణలు

image

TG: AP విజయ డెయిరీ తీరుపై తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అమిత్ రెడ్డి మండిపడ్డారు. అక్కడి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీలు ఇవ్వడంతో మార్కెట్లోకి కల్తీ పాలు, నెయ్యి వస్తున్నాయని ఆరోపించారు. మేఘనా ఫుడ్స్ తయారు చేస్తున్న నెయ్యిలో వెజిటెబుల్ ఆయిల్ ఉన్నట్లు తెలిపారు. దీనివల్ల తెలంగాణ పాడి రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నారు. AP ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

News March 7, 2026

SRPT: టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక మోటివేషన్ సెషన్: డీఈఓ అశోక్

image

పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఈనెల 9న ఉదయం 10:30 నుంచి ప్రత్యేక మోటివేషన్ సెషన్ నిర్వహిస్తున్నట్లు డీఈఓ అశోక్ తెలిపారు. టీ-శాట్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి డా. యోగితా రాణా సూచనలు చేస్తారు. పాఠశాలల్లోని ఐఎఫ్పీల ద్వారా విద్యార్థులందరూ ఈ సెషన్‌ను వీక్షించేలా ప్రధానోపాధ్యాయులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.