News February 1, 2025

రామగుండం అభివృద్ధిపై సీఎంతో చర్చ

image

రామగుండం నియోజకవర్గ అభివృద్ధి గురించి CMరేవంత్ రెడ్డితో ప్రస్తావించినట్లు MLAరాజ్ మక్కాన్ సింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు HYDలో సీఎం ను కలిసిన అనంతరం స్థానికంగా పవర్ ప్లాంట్ పనులను ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు తీరు గురించి కాసేపు చర్చించారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు MLAపేర్కొన్నారు.

Similar News

News October 18, 2025

సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి: ఎస్పీ

image

దీపావళి పండుగను జిల్లా ప్రజలు సంతోషంగా, జాగ్రత్తగా, సురక్షితంగా జరుపుకోవాలని ఎస్పీ అమిత్ బర్దార్ శనివారం సూచించారు. బాణసంచా ఇళ్లకు దూరంగా, ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే ప్రయోగించాలన్నారు. అనుకోని సంఘటనలు జరిగితే తక్షణ సహాయం కోసం 112, 9281442977, 101, 9494147918, 9390630081 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని ఆయన కోరారు.

News October 18, 2025

పెద్దపల్లి: కాలుష్యం నియంత్రణకు మార్గదర్శకాలు పాటించాలి: కలెక్టర్

image

దీపావళి సందర్భంగా పటాకుల వినియోగం వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రజలు ప్రభుత్వం, టీజీపీ‌సీబీ మార్గదర్శకాలను పాటించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం తెలిపారు. రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే పటాకులు కాల్చాలని, పాఠశాలలు, ఆసుపత్రుల సమీపంలో వాడకూడదని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో బాధ్యతగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

News October 18, 2025

భద్రాద్రి: నాయనమ్మకు తలకొరివి పెట్టిన మనవరాలు

image

టేకులపల్లి మండలం బోడు గ్రామానికి చెందిన అడపా వీరమ్మ అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. ఆమె భర్త మంగయ్య కొన్నేళ్ల క్రితమే మృతి చెందగా, వారికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉండగా, ఆయన నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో, శనివారం వీరమ్మ అంత్యక్రియల సందర్భంగా కుమారుడు లేకపోవడంతో, ఆయన ఎనిమిదేళ్ల కుమార్తె ప్రియతో తల్లి మల్లిక వెంట ఉండి నాయనమ్మకు తలకొరివి పెట్టించింది.