News February 1, 2025

రామగుండం అభివృద్ధిపై సీఎంతో చర్చ

image

రామగుండం నియోజకవర్గ అభివృద్ధి గురించి CMరేవంత్ రెడ్డితో ప్రస్తావించినట్లు MLAరాజ్ మక్కాన్ సింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు HYDలో సీఎం ను కలిసిన అనంతరం స్థానికంగా పవర్ ప్లాంట్ పనులను ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు తీరు గురించి కాసేపు చర్చించారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు MLAపేర్కొన్నారు.

Similar News

News February 19, 2025

కరీంనగర్: నూతన అధ్యక్షుడిని అభినందించిన కేంద్రమంత్రి

image

రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా మంగళవారం రెడ్డబోయిన గోపి నియామకమయ్యారు. గోపి నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియమకం పట్ల కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సమస్యలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని బండి సంజయ్ గోపికి దిశా నిర్దేశం చేశారు.

News February 19, 2025

ఐఏఎస్‌లు బానిసల్లా పనిచేయొద్దు: ఈటల

image

TG: కాంగ్రెస్ పాలనలో అధికారుల తీరుపై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్‌లు నేతలకు బానిసల్లా పనిచేయొద్దని అన్నారు. ప్రభుత్వాలు ఐదేళ్లే ఉంటాయని, ఐఏఎస్‌లు 35 ఏళ్లు ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నేతలకు అనుగుణంగా పనిచేసేవారు గతంలో జైలు పాలయ్యారని చెప్పారు. తాము కాషాయ బుక్ మెంటైన్ చేస్తున్నామని, అలాంటి వారు కచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు.

News February 19, 2025

కరీంనగర్: హైనా దాడిలో గేదె, దూడ మృతి

image

చిగురుమామిడి(M) లంబాడిపల్లికి చెందిన ఆది శ్రీకాంత్ అనే రైతుకు చెందిన గేదె, దూడ హైనా దాడిలో మృతిచెందాయి. శ్రీకాంత్ మాట్లాడుతూ.. తన గేదె, దూడను కొట్టం వద్ద కట్టేసి ఇంటికి వెళ్లానని, ఉదయం వచ్చి చూసేసరికి చనిపోయాయని విలపించారు. చనిపోయిన పశువుల విలువ లక్ష రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈవిషయాన్ని రెవిన్యూ, పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చానని చెప్పారు. ప్రభుత్వం తనను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.

error: Content is protected !!