News February 15, 2025
రామగుండం: ఈ నెల 28 వరకు కులగణన సర్వే

రేపటి నుంచి ఈ నెల 28 వరకు కులగణన సర్వే నిర్వహిస్తున్నట్లు పెద్దపెల్లి అదనపు కలెక్టర్& రామగుండం కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణ శ్రీ తెలిపారు. గతంలో వివరాలు ఇవ్వని వారు, అందుబాటులో లేని వారికి మరో అవకాశం ఇస్తున్నామన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలోని ప్రజా పాలన సేవా కేంద్రంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాలన్నారు.
Similar News
News December 1, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. రూ.700కు చేరిన టమాటా

దిత్వా తుఫాను ఎఫెక్ట్ టమాటా ధరలపై పడింది. పుంగనూరు మార్కెట్లో సోమవారం 15 కిలోల టమాటా బాక్స్ రూ.700 పలికింది. 66.19 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. రెండో రకం రూ.500, మూడో రకం రూ.350 చొప్పున వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధరలు పెరిగినట్లు రైతులు తెలిపారు.
News December 1, 2025
ఆత్మకూరులో సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సోమవారం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన రూ.15 కోట్ల చొప్పున ఆత్మకూరు, అమరచింత నగర అభివృద్ధి పనులకు, రూ.22 కోట్లతో 50 పడకల ఆసుపత్రి భవనానికి, రూ.121.92 కోట్లతో జూరాల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
News December 1, 2025
మహబూబాబాద్ డీఈఓగా రాజేశ్వర్ బాధ్యతల స్వీకరణ

జిల్లా నూతన విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా రాజేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీఈఓగా పనిచేసిన దక్షిణామూర్తి వీఆర్ఎస్ తీసుకోవడంతో, విద్యాశాఖ ఏడీగా ఉన్న రాజేశ్వర్ను డీఈఓగా నియమించారు. జిల్లా విద్యాశాఖ సిబ్బంది, పలువురు నూతనంగా బాధ్యతలు తీసుకున్న రాజేశ్వర్రావుకు అభినందనలు తెలిపారు.


