News March 28, 2025

రామగుండం: ఉద్యోగ విరమణ అనంతరం ఆనందంగా ఉండాలి: CP

image

ఉద్యోగ విరమణ అనంతరం పోలీసు కుటుంబాలు వారి శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఆత్మీయంగా సన్మానించారు. CP మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం క్లిష్టమైన పరిస్థితులలో విధులు నిర్వహించిన వారిని అభినందించారు. ఉద్యోగవిరమణ అనంతరం శాఖపరంగా వచ్చే బెనిఫిట్స్ ను సకాలంలో అందిస్తామన్నారు.

Similar News

News December 9, 2025

HYD: ఇపుడు 69.. తర్వాత 152.. ఫ్యూచర్‌లో 400 KM!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో మున్సిపాలిటీల విలీనం తరువాత విస్తీర్ణం భారీగా పెరిగింది. దీంతో రవాణా అవసరాలు కూడా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహానగరంలో మెట్రో రైలును కూడా మహానగర వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 69 కిలోమీటర్ల నెట్ వర్క్ ఉన్న మెట్రో రెండో దశలో మరో 152 KM పెరిగే అవకాశముంది. 2047 నాటికి మెట్రోను 400 KM పెంచి 623 KMకు విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.

News December 9, 2025

శోకం నుంచి శక్తిగా.. సోనియా ప్రస్థానం!

image

నేడు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు. భర్త రాజీవ్ గాంధీ మరణంతో పార్టీ పగ్గాలు చేపట్టి పురుషుల ఆధిపత్యం ఉన్న రాజకీయాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న పార్టీని అకుంఠిత దీక్షతో మళ్లీ అధికారంలోకి తెచ్చారు. పాలనలో తనదైన ముద్ర వేసి సుదీర్ఘకాలం దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. 2009లో ఇదే రోజున తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తూ ఆమె రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించారు.

News December 9, 2025

కాకినాడ: కంగారు పెడుతున్న ఎన్నికల సర్వే ?

image

ప్రస్తుతం శాసనసభ, పార్లమెంటు ఎన్నికలు లేవు. ఇప్పట్లో జరిగే అవకాశం కూడా లేదు. కానీ ఉమ్మడి తూ.గో జిల్లాలో ఐవిఆర్ సర్వే జరుగుతోంది. మీరు ఎవరికి ఓటు వేస్తారు? వైసిపి అయితే ఒకటి, ఇతరులు అయితే రెండు, కూటమికి అయితే మూడు నొక్కండి అంటూ ఫోన్లు వస్తున్నాయి. దీంతో ప్రజలు కంగారు పడుతున్నారు. ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు కదా అన్న ఆలోచనలో పడ్డారు. అసలు ఈ సర్వే ఎవరు చేస్తున్నారు? అన్నది తెలియాల్సి ఉంది.