News March 1, 2025

రామగుండం: ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి ప్రకటించిన CGM

image

రామగుండంలోని ఎరువుల కర్మాగారం (RFCL) ఈ ఏడాది ఫిబ్రవరి చివరినాటికి 103912.38 మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. కర్మాగారంలో ఉత్పత్తి అయిన నీమ్ కోటెడ్ యూరియాను తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు ప్లాంటు CGMఉదయ్ రాజహంస ప్రకటించారు. ప్లాంటు అధికారులకు, ఉద్యోగులను CGM అభినందించారు.

Similar News

News March 25, 2025

వికారాబాద్: మృత్యువులోనూ వీడని స్నేహ బంధం

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మోమిన్పేట్ మండలం మొరంగపల్లి వద్ద జరిగింది. స్థానికుల వివరాలు.. బంట్వారం మండలం రొంపల్లికి చెందిన బైకాని నరేశ్ (24), మంగలి సన్నీ (22) ప్రాణస్నేహితులు. అవసర నిమిత్తం మోమిన్పేట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా మొరంగపల్లి గేట్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు అక్కడక్కడే మృతి చెందారు. వారి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 25, 2025

వనపర్తి జిల్లా ఎండ తీవ్రత ఇలా..

image

వనపర్తి జిల్లాలో సోమవారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. పెబ్బేరు, కేతేపల్లిలో 38.4℃, దగడ 38.3, విలియంకొండ 38.2, గోపాలపేట 38.1, పెద్దమండడి, రెమడ్డుల, కనైపల్లి 38, పాన్గల్ 37.8, మదనాపూర్, ఘనపూర్ 37.7, రేవల్లి 37.6, అత్మకూరు, వనపర్తి 37.5, శ్రీరంగాపురం, జానంపేట 37.3, వెల్గొండ, సోలిపూర్ 37.2, అమరచింత 36.8℃ ఉష్ణోగ్రత నమోదైంది. గత వారంలో తీవ్రమైన ఎండలు ఉండగా.. గత రెండు రోజులుగా తక్కువగా ఉంటున్నాయి.

News March 25, 2025

కడప: భార్యను చంపిన భర్త.. అనంతరం సూసైడ్

image

కడప జిల్లా వల్లూరు మండలంలో మంగళవారం దారుణ హత్య జరిగింది. అంబవరం ఎస్సీ కాలనీలో కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త ఎర్రగుడిపాడు చెన్నకేశవ భార్య సుజాతను విచక్షణా రహితంగా కత్తితో నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం చెన్నకేశవ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కమలాపురం సీఐ రోషన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!