News February 25, 2026
రామగుండం: ఐటిఐ శిక్షకులుగా అవకాశం

రామగుండం ప్రభుత్వ ఐటీఐలో PMKVY-4.0 పథకం కింద వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ సురేందర్ తెలిపారు. CSC ఆపరేటర్ (టర్నర్), ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్, 3డీ ప్రింటింగ్ ఆపరేటర్, జూనియర్ ప్లంబర్ (జనరల్) కోర్సులలో 3 నెలలు శిక్షణ ఇవ్వడానికి అప్లై చేసుకోవాలన్నారు. పూర్తి బయోడేటాతో మార్చి 3లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News April 16, 2026
KNR: కో-ఆప్షన్ సభ్యుల పదవులకు భారీగా దరఖాస్తులు

కరీంనగర్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు సంబంధించి ఈనెల 10 నుంచి 16 వరకు దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 46 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఐదు కోఆప్షన్ సభ్యులకు భారీగా దరఖాస్తులు రావడంతో దరఖాస్తులు రావడంతో క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తుది ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు.
News April 16, 2026
వీడు మాయగాడు.. 500 మంది అమ్మాయిల్ని మోసం చేశాడు!

సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లలో ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి అమ్మాయిల్ని మోసం చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్‌కు చెందిన ఆనంద్(35) తాను డాక్టర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్, మోడల్, బిజినెస్‌మ్యాన్ అంటూ ఒక్కొక్కరితో ఒక్కోలా పరిచయం చేసుకున్నాడు. వాళ్లు దగ్గరయ్యాక మెడికల్ ఎమర్జెన్సీ పేరిట, ప్రైవేట్ ఫొటోలు లీక్ చేస్తానని బెదిరించి ₹2Cr వసూలు చేశాడు. దాదాపు 500మంది యువతుల్ని మోసగించాడు.
News April 16, 2026
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై దృష్టి పెట్టాలి

భద్రాద్రి జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిని కలెక్టర్ అంకిత్ మండలాల వారీగా పరిశీలించారు. స్లాబ్ స్థాయికి చేరిన ఇళ్లు, పూర్తయిన ఇళ్లు, మార్కింగ్ చేసినవి, ఇంకా మార్కింగ్ చేయని ఇళ్ల వివరాలను ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకున్నారు. మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలు నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి అయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆలస్యం జరిగే చోట తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.


