News March 27, 2025
రామగుండం: ఒకేసారి ఆస్తి పన్ను చెల్లించి రాయితీ పొందండి: అదనపు కలెక్టర్

ఈనెల 31 లోగా బకాయిలతో సహా ఆస్తి పన్ను మొత్తం ఒకేసారి చెల్లిస్తే 90% వడ్డీ మినహాయింపు పొందే అవకాశం ఉందని జిల్లా అదనపు కలెక్టర్& రామగుండం కార్పొరేషన్ కమిషనర్ అరుణ శ్రీ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మార్చి 31(2025) నాటికి ఉన్న ఆస్తి పన్ను బకాయిలు అన్నింటినీ ఒకేసారి చెల్లిస్తే రాయితీ పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News November 10, 2025
మిర్యాలగూడలో అమానుషం.. కుక్క నోట్లో మృత శిశువు లభ్యం

మిర్యాలగూడలో అమానుషం చోటుచేసుకుంది. సబ్ జైల్ రోడ్డులో కుక్క నోట్లో కరచుకున్న నెలలు నిండని మృత శిశువు లభ్యమైంది. పోలీసులకు సమాచారం అందించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆడశిశువు కావడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 10, 2025
క్రీడాకారులకు గ్రూప్-1 ఉద్యోగాలపై భిన్నాభిప్రాయాలు

మహిళా క్రికెటర్ శ్రీ చరణికి గ్రూప్-1, స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్, బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగాలిచ్చి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గౌరవించాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కాకుండా స్పోర్ట్స్ కోటాలో వారికి ఉద్యోగాలివ్వడంపై పలువురు ఫైరవుతున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే దిశగానే ప్రభుత్వాల నిర్ణయాలని కొందరు సమర్థిస్తున్నారు.
News November 10, 2025
హనుమకొండ: 624 మందికి ఫిట్నెస్ టెస్ట్ పూర్తి

హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో సోమవారం ప్రారంభమైన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఆదిలాబాద్, వనపర్తి జిల్లాల అభ్యర్థులకు రన్నింగ్ పోటీలు నిర్వహించారు. రాత పరీక్షలో అర్హత సాధించిన 794 మందికి గాను, 624 మంది అభ్యర్థులు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్‌లో పాల్గొన్నారు. ఈ నెల 22 వరకు 33 జిల్లాల నుంచి అభ్యర్థులను అగ్నివీరులుగా ఎంపిక చేయనున్నారు.


