News January 26, 2025

రామగుండం కమిషనరేట్‌లో సిటీ పోలీస్ యాక్ట్

image

రామగుండం కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించరాదన్నారు. ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నవారు పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News December 5, 2025

నిర్మల్: ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

image

కలెక్టరేట్‌లో శుక్రవారం ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు తొలి దశ ర్యాండమైజేషన్ మండలాల వారిగా నిర్వహించారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. జిల్లాల్లో ఎన్నికల విధులు నిర్వహించేందుకు సరిపడా సిబ్బందిని నియమించామన్నారు.

News December 5, 2025

పిల్లలు సినిమాల పిచ్చిలో పడకూడదు: పవన్

image

AP: సినిమాలు వినోదంలో ఓ భాగం మాత్రమేనని Dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. పిల్లలు ఆ సినిమాల పిచ్చిలో పడకుండా చూడాలని PTMలో పేరెంట్స్‌కి సూచించారు. గతంలో చదువుల కోసం దాతలు వందల ఎకరాలు దానమిచ్చారని గుర్తు చేశారు. నేడు ఉన్న స్థలాలు దోచుకుపోయే పరిస్థితి ఉందని, స్కూళ్లకు గ్రౌండ్స్ లేకపోవడం విచారకరమన్నారు. ‘సోషల్ టీచర్ చెప్పిన పాఠాలు నా గుండెలో నాటుకుపోయాయి. అవే నాలో సామాజిక బాధ్యతను పెంచాయి’ అని అన్నారు.

News December 5, 2025

ఎన్నికల నియమావళి అమలు చేయాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళిని ప్రణాళిక ప్రకారం అమలు చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించాలని, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, రవాణా, పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ప్రతి పనిని పక్కాగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.