News January 11, 2026

రామగుండం చేరుకున్న DCM భట్టి, మంత్రులు

image

గోదావరిఖనిలో జరిగే బహిరంగ సభకు డిప్యూటీ CM భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు హర్కార వేణుగోపాల్ చేరుకున్నారు. రామగుండం కార్పొరేషన్‌లో రూ.175 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, NTPC- ED చందన్ కుమార్ సమంతా, INTUC నేత జనక్ ప్రసాద్ పాల్గొన్నారు.

Similar News

News January 21, 2026

NLG: జిల్లా కారాగారానికి నూతన సూపరింటెండెంట్‌

image

నల్గొండ జిల్లా కారాగారానికి నూతన సూపరింటెండెంట్‌గా కె. ఆనందరావు నియమితులయ్యారు. గత సూపరింటెండెంట్ పదోన్నతిపై చర్లపల్లి కేంద్ర కారాగారానికి బదిలీ అయ్యారు. కె.ఆనందరావు గతంలో కేంద్ర కారాగారం నిజామాబాద్‌లో విధులు నిర్వహించారు. పరిపాలనా అనుభవం కలిగిన అధికారిగా గుర్తింపు పొందిన ఆయన నల్గొండ జిల్లా కారాగార అభివృద్ధికి కృషి చేస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News January 21, 2026

నిర్మల్: ‘పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి’

image

నిర్మల్ లోని 42 కౌన్సిలర్ స్థానాలకు, ఖానాపూర్‌లోని 12 కౌన్సిలర్ స్థానాలకు, ముధోల్‌లోని 26 కౌన్సిలర్ స్థానాలకు సంబంధించి బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ రావుల రామ్నాథ్ సూచించారు. నిర్మల్ వారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం (గాజుల పేట్), (ముధోల్) భైంసా ఎమ్మెల్యే నివాసం వద్ద, ఖానాపూర్ వాళ్ళు స్థానిక బీజేపీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News January 21, 2026

శంబర జాతరకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు

image

శంబర పోలమాంబ జాతర సందర్భంగా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి బుధవారం అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. ముందుగా పోలమాంబను దర్శించుకున్నారు. అనంతరం పోలీసు అధికారులుతో, దేవదాయ, ఆలయ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. విధి నిర్వహణలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై దిశా నిర్దేశం చేశారు. క్యూలైన్ల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు నిశితంగా పరిశీలించి, పటిష్ఠంగా ఏర్పాట్లు చేయాలన్నారు.