News February 5, 2025
రామగుండం: పదవీకాలం ముగిసింది.. ఫోన్ నంబర్లు బ్లాక్

రామగుండం కార్పొరేషన్ పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో అధికారికంగా ఇచ్చిన సెల్ ఫోన్లు మూగనోము పాటిస్తున్నాయి. 50 మంది కార్పొరేటర్లు, 5 కో-ఆప్షన్ సభ్యులు పదవీకాలం ముగియడంతో సంబంధిత అధికారులు ఈ నంబర్లను బ్లాక్ చేశారు. ఇప్పటికే సెల్ ఫోన్లను ఆఫీస్‌కు అప్పగించాల్సి ఉండగా యథావిధిగా ఉపయోగించుకుంటున్నారు. వీటికి సంబంధించి నెల నెల బిల్లులు చెల్లిస్తూ వచ్చింది.
Similar News
News February 17, 2025
కాంగ్రెస్‌పై విపక్షాలది తప్పుడు ప్రచారం: మంత్రి శ్రీధర్ బాబు

TG: జనాభా ప్రకారం BCలకు రిజర్వేషన్లు కల్పించాలని కులగణన చేపట్టినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుందనే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. పెద్దపల్లిలో పట్టభద్రుల MLC అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో ఆయన మాట్లాడారు. BC రిజర్వేషన్ల కోసం కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు.
News February 17, 2025
సూర్యాపేట: రంజాన్ నెలలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు

రంజాన్ నెలలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు ఒక గంట ముందు తమ కార్యాలయం నుంచి వెళ్లాడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి రెండో తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ ఉత్తర్వుల ప్రకారం ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు విధుల నుంచి గంట ముందు వెళ్లే అనుమతి ఉంటుంది. ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం ఉద్యోగుల వెసులుబాటు కోసం ఈ ఉత్తర్వులు అమలు చేస్తున్నారు.
News February 17, 2025
ఎల్లారెడ్డిపేట: ఉరి వేసుకుని వ్యక్తి మృతి

ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలం బోప్పపూర్ గ్రామంలో జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అనుమ కనకయ్య ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.