News January 16, 2025

రామగుండం: పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది: CP

image

పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ IPS అన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ASIగా పనిచేస్తూ SIగా పదోన్నతి పొందిన 13 మంది అధికారులను పదోన్నతి చిహ్నాలను అలంకరించి అభినందించారు. CPమాట్లాడుతూ.. క్రమశిక్షణతో విధులు నిర్వహించి ప్రజల్లో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని గౌరవాన్ని పెంచే విధంగా పనిచేయాలన్నారు. పోలీస్ అధికారులు రాజు, రాఘవేంద్రరావు ఉన్నారు.

Similar News

News February 11, 2025

KNR: అమృత మిత్రను విజయవంతం చేయాలి: కమిషనర్

image

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమృత్ మిత్ర పథకాన్ని మహిళా స్వయం సహాయక సంఘాలు విజయవంతం చేయాలని కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సోమవారం మహిళా సంఘ సభ్యులతో సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద ప్రారంభించిన అమృత్ మిత్ర ప్రాజెక్టు మార్గదర్శకాలపై చర్చించారు.

News February 11, 2025

హుస్నాబాద్: నేషనల్ హైవే పనులు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

image

నేషనల్ హైవే రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మనుచౌదరి నేషనల్ హైవే అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో నేషనల్ హైవే ఇంజినీర్, కాంట్రాక్టర్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. టౌన్ లో వాటర్ పైప్ లైన్, సెంట్రల్ లైటింగ్ త్వరగా పూర్తి చేయాలన్నారు. పందిళ్ళ టోల్ గేట్ నిర్మాణానికి భూసేకరణ చేయాలని ఆదేశించారు.

News February 10, 2025

కరీంనగర్: ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు.. అప్డేట్

image

కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటివరకు మొత్తం గ్రాడ్యుయేట్ నామినేషన్లు- 100, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్లు- 17 దాఖలయ్యాయని ఎన్నికల అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి వెల్లడించారు. ఇందులో నేడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి దాఖలైన నామినేషన్లు- 51, టీచర్స్ ఎమ్మెల్సీకి నామినేషన్లు- 8 వచ్చాయని తెలిపారు. కాగా.. నామినేషన్ ప్రక్రియ నేటితో ముగిసింది.

error: Content is protected !!