News August 30, 2024
రామగుండం: పరిశ్రమలు ఉన్నా ఉద్యోగాలు లేవు.!

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉన్నప్పటికీ స్థానికులకు ఉద్యోగాలు కరువయ్యాయి. కోల్డ్ బెల్ట్ ఏరియాలో నిరుద్యోగం తాండవిస్తోంది. ఇక్కడ పరిశ్రమలకు ఇతర ప్రాంతాల వారికి పెద్దపీట వేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. RFCL, సింగరేణి, మెడికల్ కాలేజీ, NTPC, బీ-థర్మల్, కేశోరాం లాంటి పరిశ్రమలు ఉన్నాయి.
Similar News
News February 17, 2025
కరీంనగర్ : నేటి సదరం క్యాంపు రద్దు

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో ఈ నెలలో 17 & 18 తేదిలలో జరుగు సదరం క్యాంపులను నిలిపివేసినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి శ్రీధర్ తెలిపారు. సదరం వెబ్‌సైట్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాలు కారణంగా నేడు సోమవారం, మంగళవారం నిర్వహించే సదరం క్యాంప్‌లు రద్దు చేశామన్నారు.
News February 17, 2025
కరీంనగర్ తొమ్మిది రోజుల్లో తెర.. విజేత ఎవరో..!?

రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాముఖ్యతగా నిలిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ హీట్ కొనసాగుతుంది. గ్రాడ్యుయేట్, టీచర్ల రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 27న పోలింగ్ జరగనుంది. కాగా..తొమ్మిది రోజులే ప్రచార సమయం ఉండడంతో అభ్యర్థులు జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎవరికి వారే గెలుపుపై లెక్కలు వేస్తూ క్యాడర్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. విజేతలపై మీ కామెంట్..?
News February 16, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

✓ శంకరపట్నం మండలంలో చికిత్స పొందుతూ యువరైతు మృతి ✓ మంథని: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు✓ కుంభమేళా వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ధర్మపురికి చెందిన మహిళా మృతి✓ జగిత్యాల పట్టణంలో ప్రముఖ చిత్రకారుడు మచ్చ రవి గుండెపోటుతో మృతి✓ జగిత్యాల: ట్రాక్టర్, బైక్ ఢీ.. ఒకరి పరిస్థితి విషయం✓ ఇల్లంతకుంట మండలంలో గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు