News July 12, 2024
రామగుండం: పోలీస్ కమిషనరేట్లో SIల బదిలీలు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఎస్సైలు బదిలీ అయ్యారు. రామగుండం SIసతీష్ – NTPC-SIగా, NTPC-SIఉదయ్ కిరణ్ని VRకు బదిలీ చేశారు. GDK-1 SI సమ్మయ్య- రామగుండం SIగా, RGM-SI ఉషారాణి VRకు, VRలో ఉన్న బానేష్ – GDK-1Townకు, GDK-SI సౌజన్య- బెల్లంపల్లికి, బెల్లంపల్లి-SIప్రశాంత్ను- GDK-1కు బదిలీ చేశారు. మరో ఇద్దరు SIలు బదిలీ అయ్యారు.
Similar News
News January 3, 2026
కరీంనగర్: డీజేలు, డ్రోన్లపై నిషేధం పొడిగింపు

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో డీజేలు, డ్రోన్ల వినియోగంపై ఉన్న నిషేధాన్ని ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. శబ్ద కాలుష్యం, భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సభలు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైక్ సెట్ల వినియోగానికి సంబంధిత ఏసీపీల అనుమతి పొందాలని ఆయన సూచించారు.
News January 3, 2026
కరీంనగర్ నగరపాలక సంస్థ ఓటర్ల జాబితాపై 53 అభ్యంతరాలు

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్ల ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం ఒక్కరోజే 49 దరఖాస్తులు రాగా, నిన్నటివి 4 కలిపి మొత్తం 53 అభ్యంతరాలు అందినట్లు నగరపాలక అధికారులు వెల్లడించారు. ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి,ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
News January 3, 2026
పర్లపల్లి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సస్పెండ్

పోస్టల్ డిపార్ట్మెంట్లో అవకతవకలకు పాల్పడిన తిమ్మాపూర్ మండలం పర్లపల్లి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సత్యంను సస్పెండ్ చేస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు పోస్టల్ శాఖ అకౌంట్లో జమ చేయకపోవడంతో వినియోగదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోస్టల్ శాఖ రూ.3.5 లక్షల అవకతవకలు జరిగినట్టు నిర్ధారించి వెంటనే సస్పెండ్ చేసింది.


