News January 26, 2025

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు సీపీ ఎం. శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 27న ఉదయం 6 గంటల నుంచి 31వ తేదీ ఉదయం 6 గంటల వరకు పోలీస్ యాక్ట్ ఆమలులో వుంటుందన్నారు. ముందస్తు అనుమతి లేకుండా కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని పేర్కొన్నారు.

Similar News

News November 17, 2025

భవాని దీక్షల విరమణకు ప్రత్యేక ఏర్పాట్లు: ఈవో

image

భవాని దీక్షల విరమణ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై సోమవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై ఆలయ అధికారులు, సిబ్బందితో సమావేశం జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శీనా నాయక్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. డిసెంబర్ 4న జరిగే కలశ జ్యోతి ఊరేగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దీక్షా విరమణ సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఈవో సిబ్బందిని ఆదేశించారు.

పాలమూరు: పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో జరగనున్న 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ B.Ed (B.Sc, B.Ed, B.A, B.Ed) సెమిస్టర్ 8 (రెగ్యులర్) పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. లేట్ ఫీజు లేకుండా ఈనెల 21వ తేదీ వరకు చెల్లించాలని తెలిపారు. లేట్ ఫీజుతో ఈనెల 24వ తేదీ వరకు చెల్లించాలని కోరారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.palamuruuniversity.comను చూడండి.