News February 1, 2025
రామగుండం పోలీస్ కమిషనరేట్ లో Mar-1 వరకు నిషేధాజ్ఞలు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి- మంచిర్యాల జిల్లాల్లోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డీజే, డ్రోన్ కెమెరాల పై నిషేధాజ్ఞలు విధించినట్లు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు మార్చి 1 వరకు కొనసాగుతాయన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గొడవలకు పాల్పడితే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
Similar News
News November 19, 2025
మెదక్: తండ్రి దాడిలో గాయపడ్డ వంశీని పరామర్శించిన కలెక్టర్

మెదక్ జిల్లా కేంద్రంలోని మాత శిశు సంక్షేమ కేంద్రంలో చికిత్స పొందుతున్న వంశీని కలెక్టర్ రాహుల్ రాజ్ పరామర్శించారు. రామాయంపేట మండలం అక్కన్నపేటలో మద్యం మత్తులో తండ్రి కొడుకు వంశీపై దాడి చేయడంతో తీవ్ర గాయాలైన ఘటన తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వంశీ వద్దకు వెళ్లి కలెక్టర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు.
News November 19, 2025
పుట్టపర్తిలో ఐశ్వర్యారాయ్

సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా భక్తజన సంద్రమైన ప్రశాంతి నిలయంలో ‘సురంజలి’ పేరుతో సంగీత కార్యక్రమం జరిగింది. అబ్బీ వి, అంతరా నంది ‘సత్యం శివం సుందరం’తో సహా పలు భక్తి గీతాలను ఆలాపించి భక్తుల్ని మైమరపింపజేశారు. బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్, గాయకుడు హరిహరన్, డ్రమ్స్ శివమణి, మాజీ సీజేఐ NV రమణ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
News November 19, 2025
సంగారెడ్డి: వాహనాలు జాగ్రత్తగా నడిపించాలి: ఎస్పీ

ఉదయం సమయంలో వాహనాలను జాగ్రత్తగా నడిపించాలని ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. ఉదయం 8 గంటల వరకు పొగ మంచు పడుతున్నందున ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవచ్చని చెప్పారు. ఉదయం సమయంలో సాధ్యమైనంత వరకు బయటకు రాకపోవడమే మంచిదని పేర్కొన్నారు. వాహనాల హెడ్ లైట్లు ఇండికేటర్లు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. కార్లలో వెళ్లేవారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలన్నారు.


