News March 7, 2025

రామగుండం పోలీస్ కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా

image

పలువురు ఐపీఎస్ లను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు సీఐడీకి బదిలీ చేయగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను రామగుండం పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేసింది. నేరాల నియంత్రణలో తనదైన ప్రత్యేకతను చాటుకున్న అంబర్ కిషోర్ రామగుండం కు బదిలీ కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News March 23, 2025

పెంచికల్పేట్: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం: MLC

image

మారుమూల గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యమని MLC దండే విఠల్ పేర్కొన్నారు. పెంచికల్పేట్ మండల కేంద్రంలో నూతన సీసీ రోడ్లకు ఆదివారం ఎమ్మెల్సీ దండే విఠల్ భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలో రూ.45 లక్షలతో సీసీ రోడ్లు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, దారుగపల్లి, చేడువాయి గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

News March 23, 2025

బెల్లంపల్లి: విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం కృషి: MLA

image

బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి అద్దాలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తు కోసం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల సంక్షేమానికి కాస్మోటిక్ ఛార్జీలను పెంచడం జరిగిందని తెలిపారు.

News March 23, 2025

టాస్ గెలిచిన CSK

image

IPL-2025: చెన్నై వేదికగా ఇవాళ MI, CSK జట్లు తలపడనున్నాయి. ముందుగా చెన్నై కెప్టెన్ రుతురాజ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు.

error: Content is protected !!