News December 19, 2024
రామగుండం పోలీస్ స్టేషన్‌ను సీపీ తనిఖీ
రామగుండం సర్కిల్ ఆఫీస్, పోలీస్ స్టేషన్లలో పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ IPS(IG) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది ఆయనకు గౌరవ వందనం చేశారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. సీపీ మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. రిసెప్షన్ సిబ్బంది, కేసుల నమోదులు, రికార్డులు పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చేవారితో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలన్నారు.
Similar News
News January 22, 2025
కరీంనగర్: ఆడపిల్లను ప్రోత్సహించాలి: కలెక్టర్
ఆడపిల్లను ప్రోత్సహించాలని, బాలికను సమాజంలో ఎదగనివ్వాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బేటీ బచావో-బేటి పడావో కార్యక్రమం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్బస్టాండ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలను రక్షించాలని ప్రతిజ్ఞ చేశారు.
News January 22, 2025
UPL లిమిటెడ్ సీఈఓతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశం
దావోస్ పర్యటనలో భాగంగా UPL లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీ CEO జైదేవ్ శ్రాఫ్‌తో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో అత్యాధునిక R&D సెంటర్, సీడ్ హబ్ ఏర్పాటు చేయడం గురించి చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ కంపెనీ భాగస్వామ్యంతో దీర్ఘకాలిక వ్యవసాయాభివృద్ధిని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
News January 22, 2025
వేములవాడ రాజన్న ఆలయంలో ఆన్‌లైన్ సేవలు ప్రారంభం
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యం కోసం ఆన్‌లైన్ సేవలను ఆలయ కార్యనిర్వాహణ అధికారి కొప్పుల వినోద్ రెడ్డి ప్రారంభించారు. ఆలయంలో ప్రతిరోజు జరిగే వివిధ పూజలు, అలాగే వసతి గదిలో వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచిట్లు ఆయన తెలిపారు. https://vemulawadatemple.telangana .gov.in/ అనే వెబ్ సైట్‌లో ఉంచినట్లు తెలిపారు.