News February 11, 2025
రామగుండం: భాగ్యనగర్ రైలు యధావిధిగా కొనసాగించాలని వినతి

ఖమ్మం వద్ద రైల్వే పనులు జరుగుతుంటే భాగ్యనగర్ రైలును రద్దు చేయడం సరికాదని, యథావిధిగా పునరుద్ధరించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేశ్ రామగుండం రైల్వే స్టేషన్ DMసునీల్ కుమార్కు కలిసి వినతి పత్రం ఇచ్చారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు నిత్యం వెళ్లే భాగ్యనగర్ రైలు తాత్కాలికంగా రద్దు చేయడం ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసినట్లు అవుతుందన్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించాలన్నారు.
Similar News
News October 30, 2025
నేటి నుంచి యథావిధిగా పాఠశాలలు: DEO

జిల్లాలో తుఫాన్ ప్రభావం తగ్గడంతో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలలోని అన్ని పాఠశాలలు గురువారం నుంచి యథావిధిగా పనిచేస్తాయని DEO కె. వాసుదేవరావు ప్రకటించారు. తుఫాను పునరావాస కేంద్రాల కోసం వినియోగించిన పాఠశాలలను సిబ్బందిచే పరిశుభ్రంగా ఉంచాలని, పాత భవనాలు, శిధిలావస్థలో ఉన్న భవనాల వద్దకు విద్యార్థులు వెళ్లకుండా స్కూల్ హెచ్ఎంలు జాగ్రత్తలు పాటించాలన్నారు. విద్యార్థులకు హాట్ వాటర్ అందించాలని DEO సూచించారు.
News October 30, 2025
గుంటూరు జిల్లాను ముంచెత్తిన వాన

మొథా తుపాన్ ప్రభావంతో గుంటూరు జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు భారీ వర్షాలు కురిశాయి. కాకుమానులో అత్యధికంగా 116.6 మి.మీ వర్షపాతం నమోదైంది. పెదనందిపాడు 114.6, ప్రత్తిపాడు 109.4, చేబ్రోలు 91.4, కొల్లిపర 78.4, వట్టిచెరుకూరు 76.2 మి.మీ వర్షపాతం నమోదైంది. తాడేపల్లి, దుగ్గిరాల, తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షం కురవడంతో తక్కువ ఎత్తున్న ప్రాంతాలు నీటమునిగాయి.
News October 30, 2025
ఆరుట్ల బుగ్గజాతరకు ఇలా వెళ్లండి

దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆరుట్ల <<18145591>>బుగ్గరామలింగేశ్వర స్వామి<<>> జాతర NOV 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ సన్నిధిలో తూర్పునుంచి పడమరకు నీరు ప్రవహించడం ప్రకృతి అద్భుతం. ఇక్కడికి ఎల్బీనగర్, పెద్దఅంబర్పేట్ నుంచి వెళ్లొచ్చు. ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నానికి వెళ్లాలి. అక్కడి నుంచి ఆరుట్ల, బుగ్గతండాకు బస్సులు, ఆటోలుంటాయి. స్వయానా రామయ్యే ప్రతిష్ఠించడం, బుగ్గతండాలో ఉండటంతో బుగ్గరామలింగేశ్వర స్వామిగా పిలుస్తుంటారు.


