News February 11, 2025

రామగుండం: భాగ్యనగర్ రైలు యధావిధిగా కొనసాగించాలని వినతి

image

ఖమ్మం వద్ద రైల్వే పనులు జరుగుతుంటే భాగ్యనగర్ రైలును రద్దు చేయడం సరికాదని, యథావిధిగా పునరుద్ధరించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేశ్ రామగుండం రైల్వే స్టేషన్ DMసునీల్ కుమార్‌కు కలిసి వినతి పత్రం ఇచ్చారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు నిత్యం వెళ్లే భాగ్యనగర్ రైలు తాత్కాలికంగా రద్దు చేయడం ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసినట్లు అవుతుందన్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించాలన్నారు.

Similar News

News February 12, 2026

కూరగాయ పంటల్లో తెగుళ్లు- కట్టడి సూచనలు

image

☛ అన్ని కూరగాయ పంటల్లో అక్షింతల పురుగు, చిత్తపురుగుల నివారణకు లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 2మి.లీ కలిపి పిచికారీ చేయాలి. వంగ, కాకర, ఆగాకర పంటలకు మాత్రం లీటరు నీటికి థయోడికార్బ్ 1 గ్రాము కలిపి పిచికారీ చేసుకోవాలి.
☛ మిరప, టమాటా, క్యాబేజీ వంటి పంటల్లో ఎండుతెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా మెటాలాక్సిల్ + మాంకోజెబ్ 2గ్రా. కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి.

News February 12, 2026

హలో అనేందుకు మంత్రుల హడల్

image

తెలంగాణలో ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందన్న మంత్రి పొంగులేటి ఆరోపణ బాంబు ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ టూల్స్‌తో BRS ట్యాప్ చేయిస్తుందేమోనని అనుమానిస్తున్న మంత్రులు నార్మల్ కాల్స్ ఆన్సర్ చేయడం లేదు. కొందరు మినిస్టర్స్ కొన్ని కాల్స్ అటెంప్ట్ చేసినా పైపై మాటలే. డీటెయిల్స్ జోలికి వెళ్లడం లేదు. ముఖ్య విషయాలు డిస్కస్ చేసేందుకు వాట్సాప్ కాల్ లేదా యాపిల్ ఫేస్ టైం వాడుతున్నారని సమాచారం.

News February 12, 2026

తాళ్లరేవు: పోలీసుల్ని చూసి భయం.. యాక్సిడెంట్‌.. బీటెక్ విద్యార్థిని మృతి

image

తాళ్ళరేవు సుంకరపాలెం జంక్షన్ సమీపంలోని ఎక్సైజ్ చెక్‌పోస్ట్ మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యానాం‌కు చెందిన పైడా కాలేజీ బీటెక్ విద్యార్థిని మహమ్మద్ మోమిన్ (22) మృతి చెందింది. హాల్ టికెట్ తీసుకుని స్కూటీపై ఇంటికొస్తున్న సమయంలో పోలీసుల్ని చూసి భయపడి అతి వేగంతో వెళ్తూ బస్సుని ఢీకొట్టారు. ప్రమాదంలో మోమిన్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆమెతో ఉన్న మరో యువతి గాయాలతో బయటపడ్డారు. కేసు నమోదైంది.