News May 23, 2024

రామగుండం- మణుగూరు రైల్వే లైను 207.80 కి.మీ

image

రామగుండం- మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక <<13298191>>రైల్వే కోర్ కారిడార్ <<>>ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. ఈ మేరకు 207.80 కి.మీ మేర ఈ నడవా విస్తరించిన ప్రాంతాల్లో నూతనంగా బ్రాడ్ గేజ్ నిర్మించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భూ సేకరణ చేపట్టాలని SCR అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో 142 కి.మీ. దూరం తగ్గనుంది.

Similar News

News November 18, 2025

కరీంనగర్: శీతాకాలంలో డ్రైవింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి: సీపీ

image

శీతాకాలంలో డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు. రాత్రిపూట, తెల్లవారుజామున ఏర్పడే దట్టమైన పొగ మంచు కారణంగా దృశ్యమానత తగ్గి రోడ్డు ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు. వాహనదారులు భద్రతను దృష్టిలో ఉంచుకొని.. నెమ్మదిగా డ్రైవింగ్ చేయాలని, పొగ మంచు ఉన్న సమయంలో ఓవర్టేక్ చేయవద్దని ఆయన సూచించారు.

News November 18, 2025

KNR: డ్రగ్స్ మూలాలు పెకిలించివేయాలి: కలెక్టర్

image

యువత, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే మత్తుపదార్థాల మూలాలను పెకిలించివేయాలని, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నేడు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య, శిశు సంక్షేమ, విద్య తదితర శాఖల అధికారులతో జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. మత్తుపదార్థాల నిర్మూలనకు నిత్యం గస్తీ నిర్వహిస్తున్నట్లు CP తెలిపారు.