News February 22, 2025
రామగుండం: యువకుడిపై కత్తితో ట్రాన్స్జెండర్ దాడి

రామగుండంకు చెందిన బాధితుడు బాదావత్ మోహన్ కొన్ని నెలల నుంచి ఖమ్మం జిల్లాలోని పెద్దతండాలో చికెన్ షాప్లో పనిచేస్తున్నాడు. ఇక్కడ ట్రాన్స్జెండర్తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. రాత్రి ఇరువురు మధ్య ఘర్షణ ఏర్పడటంతో కోపోద్రిక్తంలో ట్రాన్స్ జెండర్, మోహన్ను కత్తితో ఐదు చోట్ల పొడిచింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ట్రాన్స్జెండర్ పరారీలో ఉంది.
Similar News
News November 3, 2025
జాప్యం చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

విజయవాడ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, జేసీ ఇలక్కియ పాల్గొన్నారు. అందిన మొత్తం 194 ఫిర్యాదులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించి, పౌరుల సంతృప్తిని నిర్ధారించాలని కలెక్టర్ ఆదేశించారు. సరైన కారణం లేకుండా జాప్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 3, 2025
వైఫల్యం చెందిన అధికారిపై చర్యలు: కలెక్టర్

సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి 454 అర్జీలు అందాయని కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ప్రజా సమస్యలను కేటాయించిన సమయంలోగా పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఆమె ఆదేశించారు. శాఖల వారీగా వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అర్జీలకు రీఓపెన్ లేకుండా పరిష్కరించాలని, వైఫల్యం చెందిన అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
News November 3, 2025
NRPT: లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి: జిల్లా జడ్జి

నవంబర్ 15న జరిగే లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు కోరారు. సోమవారం జిల్లా కోర్టులో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే కేసులపై కక్షిదారులతో మాట్లాడి రాజీ చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో జడ్జిలు, న్యాయవాదులు పాల్గొన్నారు.


