News February 22, 2025
రామగుండం: యువకుడిపై కత్తితో ట్రాన్స్‌జెండర్ దాడి

రామగుండంకు చెందిన బాధితుడు బాదావత్ మోహన్ కొన్ని నెలల నుంచి ఖమ్మం జిల్లాలోని పెద్దతండాలో చికెన్ షాప్‌లో పనిచేస్తున్నాడు. ఇక్కడ ట్రాన్స్‌జెండర్‌తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. రాత్రి ఇరువురు మధ్య ఘర్షణ ఏర్పడటంతో కోపోద్రిక్తంలో ట్రాన్స్ జెండర్, మోహన్‌ను కత్తితో ఐదు చోట్ల పొడిచింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ట్రాన్స్‌జెండర్ పరారీలో ఉంది.
Similar News
News December 9, 2025
గద్వాల: రూ.50 వేలకు మించితే పత్రాలు తప్పనిసరి: ఎస్పీ

గద్వాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రూ.50 వేలకు మించి నగదు తరలించేవారు తప్పనిసరిగా సంబంధిత పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. లేనిపక్షంలో ఆ నగదును సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈనెల 11న ఎన్నికలు జరిగే గద్వాల, ధరూర్, కేటీదొడ్డి, గట్టు మండలాల్లో ఫలితాలు ప్రకటించే వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (BNSS) యాక్ట్ అమల్లో ఉంటుందన్నారు.
News December 9, 2025
గ్లోబల్ సమ్మిట్: టెక్నాలజీ గుప్పిట్లో ‘ప్రగతి’ లక్ష్యాలు!

TG గ్లోబల్ సమ్మిట్‌లో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDGs) సంచలనం సృష్టించాయి. ఫ్యూచరిస్టిక్ డోమ్‌లో ఈ 17 లక్ష్యాలను అద్భుతంగా ప్రదర్శించడం రాష్ట్ర ప్రభుత్వ ‘విజన్ 2047’కు అద్దం పట్టింది. వృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఏకకాలంలో సాగాలనే స్పష్టమైన సందేశాన్నిస్తూ, సామాజిక న్యాయం, ఆర్థికాభివృద్ధిని ముడిపెట్టే ఈ ప్రదర్శన సమ్మిట్‌కు వచ్చిన ప్రపంచ దేశాల ప్రతినిధులను ఆకర్షించింది.