News February 13, 2026
రామగుండం: ‘రెండు’ ఓట్ల తేడాతో ఘన విజయం!

రామగుండం కార్పొరేషన్ 59వ డివిజన్‌లో ఉత్కంఠ పోరు ముగిసింది. ఏఐఎఫ్‌బీ అభ్యర్థి బాలసాని తిరుపతి కేవలం 2 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ఖాజా సనాకు 768 ఓట్లు రాగా, తిరుపతికి 770 ఓట్లు వచ్చాయి. పోటాపోటీగా సాగిన ఈ పోరులో రీకౌంటింగ్ నిర్వహించగా, చివరకు తిరుపతిని విజయం వరించింది. దీంతో ఆయన అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు.
Similar News
News March 7, 2026
కాకినాడ: అమ్మ టీచరు.. కొడుకు ఐఏఎస్

కాకినాడ రూరల్ వాకలపూడికి చెందిన జీను శ్రీజస్వంత్ చంద్ర సివిల్స్-2025 ఫలితాల్లో 23వ ర్యాంకు సాధించి రికార్డు సృష్టించారు. ఆయన ఐఏఎస్ ఏపీ క్యాడర్‌కు ఎంపికయ్యారు. వాకలపూడి హైస్కూల్ టీచరు నాగలక్ష్మి కుమారుడైన ఈయన.. గతంలో 162వ ర్యాంకుతో పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతూ మళ్లీ ప్రయత్నించి ఈ విజయం అందుకున్నారు. శ్రీజస్వంత్ చంద్ర ఘనత ఐఏఎస్‌కు అర్హత సాధించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 7, 2026
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

TPCC మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ నియామకమయ్యారు. ఆమె నియామకాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆమోదించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఆమె కాంగ్రెస్‌లో 45 ఏళ్లుగా ఉన్నారు. 1991లో PACS ఛైర్‌పర్సన్‌గా తొలిసారి ఎన్నికవగా 2005లో వరంగల్ నగర మేయర్‌గా పని చేశారు. వరంగల్ పశ్చిమ నుంచి MLAగా పోటీ చేసి ఓటమి చెందారు. 2023-2025 వరకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా పని చేశారు.