News March 19, 2025
రామగుండం: సమన్వయం, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి: CP

పోలీసు సిబ్బంది సమన్వయం, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. కమిషనరేట్ లో ‘పోలీస్ దర్బార్’ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. పోలీసు అధికారులు, సిబ్బంది ఎలాంటి సమస్యలున్న నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. తద్వారా పరిష్కరిస్తామన్నారు. పోలీసులు తమ విధుల్లో నిర్లక్ష్యం వహించిన, పోలీసు శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News November 10, 2025
నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

→ మిర్యాలగూడ: అమానుషం.. కుక్క నోట్లో మృతశిశువు
→ నల్గొండ: ప్రజావాణికి 94 దరఖాస్తులు
→ నార్కట్పల్లి: లారీ బోల్తా.. ఉల్లిగడ్డ బస్తాలు ఎత్తుకెళ్ళారు.
→ నల్గొండ: ఇన్చార్జి పాలన ఇంకెనాళ్లు?
→ కట్టంగూర్: ఈ సంతకు 75 ఏళ్ల హిస్టరీ
→ నల్గొండ: తగ్గిన ఉష్ణోగ్రతలు.. చలి షురూ
→ నల్గొండ: MGUకి అరుదైన గౌరవం
→ నాగార్జునసాగర్: ఆయకట్టులో జోరుగా వరికోతలు
News November 10, 2025
VKB: జిల్లా వైద్యాధికారిగా స్వర్ణకుమారి

జిల్లాలో గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా పనిచేస్తామని జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా వైద్యాధికారిగా స్వర్ణకుమారి బాధ్యతలను స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు అందుబాటులో ఉంటూ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
News November 10, 2025
NOV 25వరకు SSC పరీక్ష ఫీజు చెల్లింపు గడువు

AP: టెన్త్ పబ్లిక్ పరీక్ష ఫీజును నవంబర్ 13నుంచి 25వరకు చెల్లించవచ్చని SSC బోర్డు డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. లేట్ ఫీ ₹50తో డిసెంబర్ 3వరకు, ₹200తో DEC 10వరకు, ₹500తో DEC 12వరకు చెల్లించవచ్చని చెప్పారు. ఫీజును https://bse.ap.gov.in లో స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చెల్లించాలని పేర్కొన్నారు. బ్యాంక్ చలానా, CFMS చెల్లింపులను ఆమోదించబోమని వివరించారు. గడువు పొడిగింపు ఉండదని స్పష్టంచేశారు.


