News February 22, 2025
రామగుండం: సర్వేలో పూర్తి వివరాలు అందించండి: అదనపు కలెక్టర్

గతంలో జరిగిన కుటుంబ, సామాజిక సర్వేలో వివరాలు అందించని కుటుంబాలు తిరిగి ఈనెల 16 నుంచి 28 వరకు పూర్తి వివరాలు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్& రామగుండం కార్పొరేషన్ ఇంచార్జీ కమిషనర్ అరుణశ్రీ ప్రకటనలో పేర్కొన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు సర్వే దరఖాస్తులు తీసుకొని పూర్తిచేసి అందించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News December 10, 2025
డిసెంబర్ 10: చరిత్రలో ఈ రోజు

1878: స్వాతంత్ర్య సమరయోధుడు, భారత గవర్నర్ సి.రాజగోపాలచారి(ఫొటోలో) జననం
1896: డైనమైట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణం
1952: సినీ నటి సుజాత జననం
1955: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిన రోజు
1985: సినీ నటి కామ్నా జఠ్మలానీ జననం
– అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం
News December 10, 2025
వరంగల్: చలికాలంలో స్థానిక ఎన్నికల హీట్!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండటంతో స్థానిక రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. వార్డుల్లో అలకలు, అసంతృప్తులు వ్యక్తమవుతుండగా, కొత్త చేరికలు, తిరుగుబాటు నేతలను బుజ్జగించే ప్రయత్నాలతో పార్టీ కార్యాలయాలు బిజీగా మారాయి. అభ్యర్థుల ఎంపిక, స్థానిక సమీకరణాలు, వర్గపోరు కలిసి ఈ చలికాలంలో ఎన్నికల హీట్‌ను పెంచుతున్నాయి.
News December 10, 2025
జగిత్యాల: 1064 టోల్‌ఫ్రీ నెంబర్‌తో అవినీతికి అడ్డుకట్ట

అవినీతి నిర్మూలనకు ప్రజలు 1064 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సూచించారు. మంగళవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి అవినీతి నిరోధక వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉద్యోగులు నిబద్ధతతో పని చేసి అవినీతి నిర్మూలనలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. లంచం అడిగితే 1064కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు.


