News February 17, 2025
రామగుండం: సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుభాని

పెద్దపెల్లి జిల్లా ది సింగరేణి కాలేజెస్ కంపెనీ లిమిటెడ్ కో ఆర్డినేషన్ జీఎంగా ఉన్న ఎన్డీ ఎం.సుభానీ పరిపాలనా సౌలభ్యం కోసం కోల్ మూమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.. ఈ మేరకు అదనపు బాధ్యతగా సుభానీని నియమిస్తూ.. సింగరేణి సీ అండ్ ఎండీ బలరామ్ ఉత్తర్వును కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు.
Similar News
News February 24, 2026
సంగారెడ్డి: మార్చి 2 నుంచి ప్రత్యేక పరీక్షలు

సంగారెడ్డి జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులకు మార్చి 2 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక పరీక్షలు-3 నిర్వహిస్తున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. మార్చి 2న తెలుగు, 4న హిందీ, 5న ఇంగ్లిష్, 6న గణితం, 7న ఫిజికల్ సైన్స్, 9న జీవశాస్త్రం, 10న సాంఘిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాలని సూచించారు.
News February 24, 2026
IOCL దిగ్బోయ్ రిఫైనరీలో పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<
News February 24, 2026
రామప్ప టెంపుల్ WONDERFUL: ఫ్రాన్స్ దేశస్థులు

వెంకటాపూర్ మండలం పాలంపేటలోగల కాకతీయుల కాలంనాటి రామప్ప దేవాలయం అద్భుతంగా ఉందని ఫ్రాన్స్ దేశస్థులు అన్నారు. మంగళవారం ఆలయంలో రామలింగేశ్వర స్వామికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఉమాశంకర్, హరీశ్ శర్మ వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ గైడ్ తాడే బోయిన వెంకటేశ్ ద్వారా ఆలయ చరిత్ర, శిల్ప సంపద గురించి తెలుసుకున్నారు. వారివెంట టూరిస్ట్ పోలీసులు శ్రీకాంత్, అరుణ్ కుమార్, భద్రు ఉన్నారు.


