News February 4, 2025

రామగుండం: సింగరేణి కార్మికులకు క్యాష్ ప్రైజ్.. ఎందుకంటే..?

image

మరో 2 నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సింగరేణి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో టార్గెట్ రీచ్ అయితే కార్మికులకు క్యాష్ ప్రైజ్ అందించేందుకు సిద్ధంగా ఉంది. ప్రాంతాల వారీగా, గనుల వారీగా లక్ష్యాన్ని చేరుకుంటే నగదు బహుమతులను అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు యాజమాన్యం పేర్కొంది. ఈ అవకాశాన్ని ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు కల్పించింది.

Similar News

News January 16, 2026

వేములవాడకు చేరుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క

image

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వేములవాడకు చేరుకున్నారు. వేములవాడకు చేరుకున్న మంత్రి సీతక్కకు వేములవాడ ఆర్డీవో రాధాబాయి, ఆలయ ఈవో రమాదేవి, వేములవాడ ఏఎస్పీ రిత్విక్ సాయి ఘనంగా స్వాగతం పలికారు. రేపు శుక్రవారం ఉదయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

News January 16, 2026

కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరలో ఉద్రిక్తత!

image

భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్యూలైన్‌లో ఇద్దరు భక్తుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అడ్డుకోబోయిన పోలీసులపై యువకుడు దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. పోలీసులు, భక్తుల మధ్య వాగ్వాదం జరగడంతో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 15, 2026

కేటీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా

image

కరీంనగర్‌లో ఈ నెల 19న జరగాల్సిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన వాయిదా పడింది. ఉమ్మడి జిల్లా నూతన సర్పంచుల అభినందన సభకు కేటీఆర్ హాజరుకావాల్సి ఉండగా.. అదే రోజు నుంచి ప్రభుత్వం సర్పంచులకు శిక్షణ తరగతులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.వి.రామకృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. సభ నిర్వహణ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.