News April 11, 2025
రామగుండం: 14న సింగరేణిలో వేతనంతో కూడిన సెలవు

భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 14న సింగరేణి ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సెలవు రోజున అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు సాధారణ వేతనంతో కలిపి మూడు రేట్లు వేతనం చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News November 11, 2025
విజయవాడ: 11 గంటలైనా ఈ ప్రభుత్వ ఆఫీసుకి ఉద్యోగులు రారు!

విజయవాడ బందర్ రోడ్లోని పంచాయతీరాజ్ అండ్ ఇంజనీరింగ్ విభాగం జిల్లా కార్యాలయంలో 18 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉదయం 11 గంటలు అయినప్పటికీ కేవలం ఆరుగురు మాత్రమే ఆఫీసుకు వచ్చారు. వాస్తవానికి ప్రభుత్వం నిర్దేశించిన సమయం 10గంటలు కాగా.. వారంలో సగం రోజులకు పైగా 11 గంటల వరకు ఉద్యోగులు రావడం లేదని ఆరోపణలున్నాయి. ప్రభుత్వ కార్యాలయం కదా ఎప్పుడొచ్చినా అడిగే వారు ఎవరులే అన్నట్లు అధికారులు తీరు కనిపిస్తోంది.
News November 11, 2025
WGL: ‘అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100కు కాల్ చేయండి’

ప్రజా భద్రత పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని వరంగల్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో స్నిఫర్ డాగ్స్తో సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ చర్యలు ప్రజా రక్షణను పటిష్ఠం చేస్తాయని అధికారులు తెలిపారు.
News November 11, 2025
గ్రామీణ యువత ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో రంగంపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను మంగళవారం కలెక్టర్ కోయ హర్ష ప్రారంభించారు. గ్రామీణ నిరుద్యోగ యువత ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి సాధించాలన్నారు. టైలరింగ్, మగ్గం వర్క్ వంటి రంగాలలో శిక్షణ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపర్ణ రెడ్డి, రాకేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


