News March 11, 2025

రామగుండం CP కి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

రామగుండం కమిషనరేట్ సీపీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అంబర్ కిషోర్‌ఝా కు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను కమిషనరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు చెప్పారు. ఇరువురు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. జిల్లాలోని పలు సమస్యల గురించి చర్చించుకున్నారు.

Similar News

News February 10, 2026

భారత్‌తో మ్యాచ్ ఆడండి.. పాక్‌కు బంగ్లా రిక్వెస్ట్

image

పాకిస్థాన్ నిజమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ అమినుల్ ఇస్లాం ప్రశంసల వర్షం కురిపించారు. ‘మాకు మద్దతుగా పాకిస్థాన్ నిలబడిన తీరుకు రుణపడి ఉంటాం. నేను నిన్న PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీతో భేటీ అయ్యాను. వారి సపోర్ట్‌కు కృతజ్ఞతలు తెలిపాను. క్రికెట్ మేలు కోసం ఈ నెల 15న భారత్‌తో మ్యాచ్ ఆడాలని వారికి విజ్ఞప్తి చేశాను’ అని వ్యాఖ్యానించారు.

News February 9, 2026

BNGR: ఆ 18 కార్డులతో ఓటేయొచ్చు: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు కలెక్టర్ హనుమంతరావు కీలక సూచన చేశారు. ఓటరు కార్డు లేకపోయినా ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, ఉపాధి హామీ జాబ్ కార్డు సహా ప్రభుత్వం జారీ చేసిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించి ఓటు వేయవచ్చని తెలిపారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.

News February 9, 2026

చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్

image

చంద్రయాన్-3 విజయం తర్వాత ఇస్రో మరో చారిత్రక అడుగుకు సిద్ధమైంది. చంద్రుడి మట్టిని భూమికి తీసుకొచ్చే ‘చంద్రయాన్-4’ మిషన్‌కు కీలకమైన ల్యాండింగ్ సైట్‌ను ఖరారు చేసింది. ఈసారి కూడా చంద్రుడి సౌత్ పోల్ ప్రాంతానికే ఇస్రో ప్రాధాన్యం ఇచ్చింది. ఇది ‘లూనార్ శాంపిల్ రిటర్న్’ మిషన్ కావడంతో ల్యాండింగ్‌, మట్టి సేకరణ, తిరిగి రావడం వంటి క్లిష్ట దశలు ఉన్నాయి. 2028 నాటికి ఈ మిషన్‌ను ప్రయోగించనున్నారు.