News February 17, 2025
రామగుండం: KCR బర్త్ డే.. వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు

రామగుండం మాజీ శాసనసభ్యుడు కోరుకంటి చందర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా వినూత్నంగా సేవా కార్యక్రమాలు చేపట్టి వండర్ బుక్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ రికార్డును రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు కోఆర్డినేటర్ నుంచి సోమవారం అందుకున్నారు. ఒకే రోజు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు ఈ అవార్డును అందుకున్నట్లు నేతలు తెలిపారు.
Similar News
News December 17, 2025
నారాయణపేట: తుది దశలో మొదటి విజయం

ఊట్కూరు మండల పరిధిలోని సమిస్తాపూర్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల తొలి ఫలితం వెలువడింది. గ్రామంలో మొత్తం 440 ఓట్లు ఉండగా 382 ఓట్లు పోలయ్యాయి. నలుగురు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీలో రింగు గుర్తుకు 48, కత్తెర గుర్తుకు 176, బ్యాట్ గుర్తుకు 30, ఫుట్‌బాల్ గుర్తుకు 127 ఓట్లు వచ్చాయి. ఇందులో కత్తెర గుర్తుతో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జయప్రకాశ్ రెడ్డి సర్పంచ్‌గా గెలుపొందారు.
News December 17, 2025
గొల్లభామ తండా సర్పంచ్‌గా బాలు నాయక్

చెన్నారావుపేట మండలంలోని గొల్లభామ తండా గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన గుగులోతు బాలు నాయక్ విజయం సాధించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజలతో కలిసి ముందుకు సాగుతానని, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
News December 17, 2025
ఉగాది నాటికి మరో 5 లక్షల గృహప్రవేశాలు: CM

AP: గడువులోగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని CM CBN కలెక్టర్లను ఆదేశించారు. ‘ఇటీవల 3 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాం. ఉగాది నాటికి మరో 5 లక్షల గృహప్రవేశాలు నిర్వహించబోతున్నాం. ప్రతి 3 నెలలకు టార్గెట్ పెట్టుకుని నిర్మాణం పూర్తి చేయాలి. గతంలో ఊళ్లకు దూరంగా ఇళ్ల స్థలాలు కేటాయించడంతో కొందరు వెళ్లడం లేదు. వారికి ఇతర ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలి’ అని సూచించారు.


