News February 17, 2025
రామగుండం: KCR బర్త్ డే.. వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు

రామగుండం మాజీ శాసనసభ్యుడు కోరుకంటి చందర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా వినూత్నంగా సేవా కార్యక్రమాలు చేపట్టి వండర్ బుక్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ రికార్డును రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు కోఆర్డినేటర్ నుంచి సోమవారం అందుకున్నారు. ఒకే రోజు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు ఈ అవార్డును అందుకున్నట్లు నేతలు తెలిపారు.
Similar News
News March 26, 2025
KU సెమిస్టర్స్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నిన్నటితో ఈ గడువు ముగియగా ఏప్రిల్ 2 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.
News March 26, 2025
KNR: ఉచిత e-Auto డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్ ఎల్ఎండి కాలనీలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళలకు ఉచిత e-Auto డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా డైరెక్టర్ వి.సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 45 సం.ల లోపు 50 మంది నిరుపేద గ్రామీణ SC, ST, BC & MINORITY మహిళలకు 45 నుంచి 60 రోజుల పాటు శిక్షణ ఇస్తామని అన్నారు. ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవచ్చు, వివరాలకు పని దినాల్లో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.