News March 21, 2025

రామచంద్రపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

ఆర్సీపురంలో ఘోర రోడ్డు ప్రమాద సంఘటన రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎలక్ట్రికల్ వెహికల్ ను ఆర్ఎంసి వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఎలక్ట్రికల్ వెహికల్ నడిపిస్తున్న సాదు రవితేజ (36) తలపై నుంచి వాహనం పోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 23, 2025

యువకులు గల్లంతుపై ఇన్‌ఛార్జి మంత్రి ఆరా

image

కొమరాడ మండలం జంఝావతి రబ్బరు డ్యాంలో ముగ్గురు యువకులు గల్లంతుపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. సివిని గ్రామానికి చెందిన యువకులని మంత్రికి వివరించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించినట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించినట్లు తెలిపారు.

News November 23, 2025

వేగంగా కోలుకుంటున్న శ్రేయస్

image

ఆసీస్‌తో ODI సిరీస్‌లో గాయపడిన శ్రేయస్ అయ్యర్ వేగంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంపై PBKS కో ఓనర్ ప్రీతిజింటా అప్డేట్ ఇచ్చారు. ఆ జట్టు ప్లేయర్ శశాంక్ సింగ్ బర్త్‌డే పార్టీలో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. శ్రేయస్ అద్భుతంగా రికవరీ అవుతూ బయటకు రావడం సంతోషంగా ఉందన్నారు. కాగా SAతో ODI సిరీస్‌కు అతను ఇప్పటికే దూరమయ్యారు. జనవరిలో NZతో జరిగే వన్డేలకు అందుబాటులోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

News November 23, 2025

కొమరాడ: రబ్బర్ డ్యాంలో ముగ్గురు గల్లంతు

image

కొమరాడలోని జంఝావతి నదిపై ఉన్న రబ్బర్ డ్యాంలో ఆదివారం సాయంత్రం స్నానానికి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని శివిని గ్రామానికి చెందిన గోవింద నాయుడు, సంతోష్ కుమార్, అరసాడ్ ప్రదీప్‌లు రబ్బర్ డ్యాంను చూసేందుకు వచ్చి స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్సై నీలకంఠం తెలిపారు.