News March 20, 2025
రామచంద్రపురం : పోలీసుల అదుపులో కసాయి తండ్రి..!

ఇద్దరు కన్న బిడ్డలను కాలువలో తోసేసి పరారైన రాయవరం (M) వెంటూరుకు చెందిన పిల్లి రాజు బుధవారం రామచంద్రపురం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. సోమవారం నెలపర్తిపాడు శివారు గణపతి నగరం సమీపంలోని పంట కాలువలో కారుణ్యశ్రీ (7), రామ సందీప్(10)ను తండ్రి రాజు పంట కాలువలో తోసేసిన విషయం తెలిసిందే. కారుణ్యశ్రీ మృత్యువాత పడగా సందీప్ ప్రాణాలు దక్కించుకున్నాడు
Similar News
News September 14, 2025
ప్రకాశం కొత్త కలెక్టర్ ముందు సవాళ్లు ఇవేనా..!

ప్రకాశం జిల్లా కలెక్టర్గా రాజాబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. గత కలెక్టర్ తమీమ్ అన్సారియాను బదిలీ చేసిన ప్రభుత్వం, జిల్లా ప్రజలకు అధికార యంత్రాంగాన్ని మరింత చేరువ చేసే లక్ష్యంలో రాజాబాబును ప్రభుత్వం గుర్తించి మరీ భాద్యతలు అప్పగించింది. అయితే నూతన కలెక్టర్ ముందు తొలుత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, వెలుగొండ పూర్తి, భూ సమస్యలు సవాళ్లుగా నిలవనున్నాయి.
News September 14, 2025
రూ.81 వేల వరకు జీతం.. ఇవాళే లాస్ట్!

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళే చివరి తేదీ. ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ చేసినవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. వయసు 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి జీతం రూ.25,500 నుంచి రూ.81,100(అలవెన్సులు అదనం) వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు www.mha.gov.in వెబ్సైటును సంప్రదించగలరు.
News September 14, 2025
భారీ బహిరంగ సభ.. నేడు విశాఖకు జేపీ నడ్డా

AP: నేడు రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. విశాఖ రైల్వే మైదానంలో నిర్వహించే సారథ్య యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వెల్లడించారు. ఈనెల 17న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా విశాఖలో పర్యటిస్తారని తెలిపారు. అలాగే అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా ఖాదీ సంత నిర్వహించబోతున్నట్లు ప్రెస్మీట్లో తెలిపారు.