News March 20, 2025

రామచంద్రపురం : పోలీసుల అదుపులో కసాయి తండ్రి..!

image

ఇద్దరు కన్న బిడ్డలను కాలువలో తోసేసి పరారైన రాయవరం (M) వెంటూరుకు చెందిన పిల్లి రాజు బుధవారం రామచంద్రపురం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. సోమవారం నెలపర్తిపాడు శివారు గణపతి నగరం సమీపంలోని పంట కాలువలో కారుణ్యశ్రీ (7), రామ సందీప్‌(10)ను తండ్రి రాజు పంట కాలువలో తోసేసిన విషయం తెలిసిందే. కారుణ్యశ్రీ మృత్యువాత పడగా సందీప్ ప్రాణాలు దక్కించుకున్నాడు

Similar News

News April 24, 2025

పీఓకేలో 42 ఉగ్ర లాంచ్ ప్యాడ్స్!

image

ఆక్రమిత కశ్మీర్‌లో 42 లాంచ్ ప్యాడ్‌లను పాక్ సిద్ధం చేసినట్లు భారత భద్రతా బలగాలు గుర్తించాయి. 130మంది ఉగ్రవాదులు పైనుంచి ఆదేశాలు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో చొరబడి విధ్వంసం సృష్టించేందుకు వీరు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహ్మద్, లష్కరే నుంచి 60మంది ఉగ్రవాదులు, స్థానిక టెర్రరిస్టులు 17మంది కశ్మీర్‌లో యాక్టివ్‌గా ఉన్నారని నిఘా వర్గాలు తెలిపాయి.

News April 24, 2025

విశాఖ: కొద్దిరోజుల్లో పెళ్లి.. యువతి ఆత్మహత్య

image

మరికొద్ది రోజుల్లో వివాహం అనగా ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో గురువారం జరిగింది. టూ టౌన్ సీఐ ఎర్రంనాయుడు వివరాల ప్రకారం.. నగరంలోని కల్లుపాకల ప్రాంతానికి చెందిన వెంకటలక్ష్మి ఓ యువకుడిని ప్రేమించింది. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ యువతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం KGHకు తరలించారు.

News April 24, 2025

ఇది భారత్‌పై దాడి: ప్రధాని మోదీ

image

పహల్‌గామ్‌లో పర్యాటకులపై దాడిని భారత్‌పై దాడిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంటుందన్నారు. ఈ నరమేధాన్ని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయని మోదీ గుర్తు చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదులను విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఆప్తులను కోల్పోయినవారికి న్యాయం చేయడానికి అన్ని చర్యలు చేపడతామని వెల్లడించారు.

error: Content is protected !!