News June 20, 2024
రామచంద్రపురం మంత్రిని కలిసిన ఎస్పీ శ్రీధర్
రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి పదవి చేపట్టిన వాసంశెట్టి సుభాశ్‌ను అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ మంత్రికి దుశ్శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. రామచంద్రపురం నియోజవర్గం అభివృద్ధికి ఎస్పీ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News September 10, 2024
రాజమండ్రి: చిరుత పాదముద్రల గుర్తింపు
దివాన్ చెరువు ప్రాంతంలో సోమవారం చిరుత పులి పాదముద్రలను గుర్తించినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి భరణి ఓ ప్రకటనలో తెలిపారు. చిరుత అటవీ ప్రాంతంలోనే ఉన్నట్లు ట్రాప్ కెమెరాల్లో కదలికలు రికార్డయ్యాయన్నారు. చిరుత వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. దాన్ని పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశామని, చిరుత సంచారాన్ని బట్టి ట్రాప్ కెమెరాలను మారుస్తున్నట్లు పేర్కొన్నారు.
News September 9, 2024
రాజమండ్రి: ఉపాధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
రాజమండ్రి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణ కోసం గ్రామీణ యువకుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ సోమవారం తెలిపారు. సెల్ ఫోన్ రిపేర్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సెక్యూరిటీ కెమెరా ఏర్పాట్లు సర్వీస్ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి యువత దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News September 9, 2024
రాజమండ్రి: శాటిలైట్ సిటీలో పులి.. అంతా ఎడిటింగ్ (VIDEO)
రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని శాటిలైట్ సిటీ గ్రామంలోని స్థానిక రాజీవ్ గృహకల్ప అపార్ట్‌మెంట్స్ 11వ వీధిలో అర్ధరాత్రి చిరుత సంచరిస్తుందనే వార్త నిజం కాదని అటవీ అధికారులు తెలిపారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు ఫొటో ఎడిట్ చేశారని వివరించారు. ఆకతాయి పనులు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.