News January 31, 2025
రామచంద్రాపురం: ప్రేమ పెళ్లి చేసిన జనసేన నేత

రామచంద్రపురం మండలం ఓదూరుకు చెందిన తాతపూడి రాజు(24), క్రాంతి భవాని(21) ప్రేమించుకున్నారు. వాళ్ల పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో జనసేన రామచంద్రాపురం ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్‌ని ఆశ్రయించారు. ఆయన అమ్మాయి, అబ్బాయి పెద్దలను పిలిపించారు. మేజర్లు కావడంతో రెండు కుటుంబాలను పెళ్లికి ఒప్పించారు. వారి అంగీకారంతో గురువారం రాత్రి జనసేన ఆఫీసులోనే ప్రేమ పెళ్లి చేయించారు.
Similar News
News December 5, 2025
ఎన్టీఆర్ జిల్లాలో తగ్గుతున్న రోడ్డు ప్రమాదాలు: కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గుతున్నాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. 2024లో 1343 ప్రమాదాలు ఉండగా, 2025లో 918కి తగ్గాయని చెప్పారు. ప్రమాదాల్లో మూడొంతులు ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతున్నాయని పేర్కొన్నారు. మద్యం తాగి నడిపితే కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ రాజశేఖర్ బాబు హెచ్చరించారు. బ్లాక్స్పాట్లపై చర్యలు వేగవంతం చేస్తామన్నారు.
News December 5, 2025
అమెరికాలో అగ్నిప్రమాదం.. తెలుగు విద్యార్థులు మృతి

అమెరికా బర్మింగ్‌హామ్‌లోని అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఉడుముల సహజ రెడ్డి, కూకట్‌పల్లికి చెందిన విద్యార్థి మృతిచెందారు. వీరు అలబామా యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో మొత్తం 10 మంది తెలుగు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 5, 2025
FEB 8 నుంచి శ్రీశైల బ్రహ్మోత్సవాలు

AP: నంద్యాల(D)లోని శ్రీశైల మల్లన్న ఆలయంలో ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. లక్షలాది మంది భక్తులు రానుండటంతో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని EO శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. క్యూలు, మంచినీరు, అటవీ ప్రాంతంలో నడకదారి భక్తులకు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. FEB 15న పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం, 16న స్వామి అమ్మవార్ల రథోత్సవం ఘనంగా నిర్వహించాలన్నారు.


