News March 19, 2025

రామచంద్రాపురం: బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. వ్యక్తి మృతి

image

రావులపాలెం నుంచి సాలూరుకి వెళ్లే ఆర్టీసీ బస్సు మంగళవారం సాయంత్రం రామచంద్రాపురం మార్కెట్ సెంటర్ రామాలయం వద్ద బైక్‌పై వెళ్తున్న పల్లి జీవరత్నం(71) అనే వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. దీంతో వెంటనే స్థానికులు అతడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతడిని పరీక్షించి మరణించినట్లు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌బాడీని మార్చురీకి పంపించారు.

Similar News

News November 23, 2025

జగన్ అన్నతో గ్రేట్ మీటింగ్: KTR

image

ఏపీ మాజీ సీఎం జగన్‌ను <<18362238>>కలిసిన<<>> ఫొటోలను కేటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘బెంగళూరులోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో జగన్ అన్నతో గ్రేట్ మీటింగ్’ అని పేర్కొన్నారు. మరోవైపు జగన్, కేటీఆర్ కలవడంతో అటు వైసీపీ, ఇటు BRS ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మెదక్: మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

image

ఫేక్ ట్రేడింగ్, ఫేక్ ఐపీఓలు, పార్ట్‌టైమ్ జాబ్ మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. చిన్న పొరపాట్లు కూడా పెద్ద ఆర్థిక నష్టాలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రజలు ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఆన్లైన్ ట్రేడింగ్, బ్యాంకింగ్ సేవలను వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.