News May 4, 2024

రామచంద్రాపురం: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

తాటిమాకుల కండ్రిగ గ్రామానికి చెందిన మహేశ్ బాబు(49) పొలం వద్ద బోరు మోటార్ మరమ్మతుకు గురైంది. మెకానిక్ సాయంతో బోరు నుంచి పైపులు బయటకు తీస్తుండగా చేతిలోని ఇనుప పైపు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగపై పడటంతో అతను విద్యుత్ షాక్‌కు గురై కిందపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించగా అక్కడ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News January 13, 2025

తిరుపతి: కర్ణాటక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

కర్ణాటక రాయల్పాడు వద్ద ఆదివారం రాత్రి రెండు కార్లు ఢీకొనడంతో తిరుపతికి చెందిన ప్రకాశ్, కడపకు చెందిన టీచర్ మారుతి శివకుమార్ మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. తిరుపతి కట్టకిందపాలెంకు చెందిన ప్రకాశ్ (55) అశోకనగర్లో ఉండే ఆనంద్‌తో కలిసి బెంగళూరు వెళ్లాడు. ఆదివారం వారు వస్తుండగా రాయల్పాడు వద్ద కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. టీచర్ మృతదేహాన్ని శ్రీనివాసపురానికి తరలించారు.

News January 13, 2025

‘ఎస్వీయూ వీసీ పోస్ట్ బీసీలకు ఇవ్వాలి’

image

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ పోస్టును బీసీలకు ఇవ్వాలని బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ కేతే నారాయణస్వామి డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆదివారం బీసీల ఆత్మీయ సమావేశం జరిగింది. నారాయణస్వామి మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర జనాభాలో బీసీలు 60 శాతం పైగా ఉన్నారని చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు సగం కేటాయించాలని డిమాండ్ చేశారు.

News January 13, 2025

చిత్తూరు: భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.