News April 16, 2025

రామడుగు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రామడుగు మండల కేంద్రంలోని తాటి వనం వద్ద మోచ భూమయ్య మంగళవారం రాత్రి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 22, 2025

APK ఫైల్స్ ఓపెన్ చేసి ఇన్ స్టాల్ చేస్తే ఇలా చేయండి: సీపీ

image

ఎవరైనా అనుకోకుండా అనుమానాస్పద, మోసపూరిత APK ఫైల్‌ను క్లిక్ చేసి లేదా ఇన్‌స్టాల్ చేసి ఉంటే ఇలా చేయాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు.
1. వెంటనే మీ మొబైల్‌ను ఫ్లైట్ మోడ్‌కు మార్చండి.
2. అనుమానాస్పద APK ఫైల్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి/తొలగించండి.
3. అన్ని సందేశ ఫార్వార్డింగ్ ఎంపికలను నిలిపివేయడానికి మీ ఫోన్ నుండి ##002# డయల్ చేయండి.
4. 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు డయల్ చేయండి.

News October 22, 2025

కరీంనగర్: ‘నకిలీ APK’ ఫైల్స్‌తో జాగ్రత్త: సీపీ

image

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం హెచ్చరించారు. వాట్సప్ గ్రూపుల ద్వారా నకిలీ APK పైళ్లను సర్కులేట్ చేస్తున్నారని, అలాంటి ఫైళ్లను ఓపెన్ చేసి, ఇన్‌స్టాల్ చేయవద్దని ఆయన సూచించారు. మోసపూరిత యాప్ లను ఇన్స్టాల్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అవుతుందని, అలా జరిగినప్పుడు వెంటనే https://www.cybercrime.gov.in సైబర్ క్రైమ్ వెబ్ సైట్ లో కానీ,1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.

News October 22, 2025

స్నేహబంధం కోసం సీపీ ఆలం.. HZBలో ఆకస్మిక సందర్శన

image

కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తన బ్యాచ్‌మేట్, ఐపీఎస్ అధికారి చింత కుమార్‌ను కలిసేందుకు హుజురాబాద్‌లోని పోతిరెడ్డిపేట గ్రామానికి ఆకస్మికంగా వచ్చారు. సెలవుపై స్వగ్రామంలో ఉన్న చింత కుమార్‌తో గౌష్ ఆలం ఆప్యాయంగా సమావేశమై, పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఉన్నత వృత్తి బాధ్యతల మధ్య కూడా వ్యక్తిగత బంధాలకు ప్రాధాన్యత ఇస్తూ సీపీ చేసిన ఈ పర్యటన అందరి దృష్టిని ఆకర్షించింది.