News June 29, 2024
రామతీర్థంలో క్రీస్తు శకం మూడవ శతాబ్ది బౌద్ధ ఆనవాళ్లు

చీమకుర్తి మండలం రామతీర్థంలోని మోక్ష రామలింగేశ్వరాలయంలో క్రీస్తు శకం మూడవ శతాబ్దం నాటి బౌద్ధఆనవాళ్లను గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఇటీవల రామతీర్థం ఆలయ పరిసరాల్లో జరిపిన అన్వేషణలో ఆలయం వెనుక వైపు నిర్లక్ష్యంగా పడి ఉన్న శివలింగాల మధ్య పలనాటి సున్నపు రాతి బౌద్ధ స్తంభాన్ని దానిపైన అర్ధచంద్రాకార పద్మాన్ని గుర్తించినట్లు ఆయన చెప్పారు.
Similar News
News January 9, 2026
ప్రకాశం కలెక్టర్ సంచలన కామెంట్స్.!

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు మరోమారు రెవిన్యూ అధికారులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం రెవెన్యూ అధికారులతో ప్రత్యేక కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యలకు సంబంధించి అమాయకులైన ప్రజలతో కన్నీళ్లు పెట్టిస్తే ఊరుకోనంటూ కలెక్టర్ హెచ్చరించారు. అలాగే తమ అధికారాలను సక్రమంగా వినియోగించాలని, పద్ధతి పనితీరు మారకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు.
News January 9, 2026
ప్రకాశం: లోన్ తీసుకున్నారా.. అసలు కడితే చాలు.!

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులకు SC కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ కీలక సూచనలు చేశారు. ప్రకాశం జిల్లాలో కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు పొందిన వారు కొవిడ్-19 కారణంగా గతంలో రుణాలు చెల్లించలేదన్నారు. అలాంటి వారికోసం ప్రస్తుతం వడ్డీ పూర్తి రద్దుతో నగదు చెల్లించే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 30లోగా వడ్డీ లేకుండా చెల్లించి రుణాలను మాఫీ చేసుకోవచ్చన్నారు.
News January 9, 2026
త్వరగా స్థలాలను గుర్తించాలి: ప్రకాశం కలెక్టర్

ఎంఎస్ఎంఈ పార్కులకు త్వరగా స్థలాలను గుర్తించాలని ప్రకాశం కలెక్టర్ రాజబాబు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఒంగోలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు సైతం తగిన స్థలాలను గుర్తించాలన్నారు.


