News February 24, 2025

రామతీర్థంలో శివరాత్రికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 26 నుంచి జరిగే శివరాత్రి జాతర ఉత్సవాలకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సీఐ రామకృష్ణ, ఎస్ఐ గణేశ్‌తో కలిసి రామతీర్థంలో ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. క్యూలైన్లు, వాహనాల పార్కింగ్, ప్రసాదం కౌంటర్లు తదితర ఏర్పాట్లను పరిశీలించి, సూచనలు చేశారు. ఏర్పాట్లపై ఆలయ ఈఓ శ్రీనివాసరావుతో చర్చించారు.

Similar News

News February 25, 2025

చికెన్‌, గుడ్లు నిర్భ‌యంగా తినొచ్చు: VZM కలెక్టర్ 

image

ప్ర‌జ‌లు చికెన్‌, కోడిగుడ్ల‌ను నిర్భ‌యంగా తినొచ్చ‌ని కలెక్టర్ అంబేడ్కర్ సూచించారు. బ‌ర్డ్‌ఫ్లూ వ్యాధి, చికెన్‌, కోడిగుడ్ల వినియోగంపై త‌మ ఛాంబ‌ర్‌లో వివిధ శాఖ‌ల అధికారుల‌తో సోమ‌వారం సమీక్ష జరిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో బ‌ర్డ్‌ఫ్లూ వ్యాధి గానీ, ఆ ల‌క్ష‌ణాలు గ‌ల వ్యాధిగ్ర‌స్తులు గానీ లేర‌ని ప‌శు వైద్యాధికారులు దృవీక‌రించార‌ని చెప్పారు.

News February 24, 2025

VZM: శివరాత్రి రోజున మాంసం విక్రయాలు జరపకుండా నిషేధించాలి

image

ఈ నెల 26 న మహాశివరాత్రి రోజున జిల్లాలో ఎక్కడా మాంసం విక్రయాలు జరపకుండా నిషేధం విధించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి ఐక్య వేదిక అధ్యక్షుడు మద్దిల సోంబాబు డిమాండ్ చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజారోగ్య శాఖాధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తిని కలిసి వినతిపత్రం అందజేశారు. హిందూ పవిత్ర పర్వదినాల్లో కూడా మాంసం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయని వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News February 24, 2025

VZM: రైతుల నుంచి టమాటాల సేకరణ

image

టమాటా ధరలు పతనమై నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆ శాఖ సహాయ డైరెక్టర్ బి.రవికిరణ్ ఆదేశాలతో సాలూరు నుంచి 80 టన్నుల టమాటాలను నగరంలోని రైతు బజార్లకు తెప్పించి అమ్మకాలు చేపట్టారు. రింగురోడ్డు, ఆర్‌అండ్‌బి రైతు బజార్లలో రూ.12కు రైతుల ద్వారా టమాటా అమ్మకాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

error: Content is protected !!