News February 26, 2025
రామప్పకు ప్రత్యేక ఆకర్షణ నందీశ్వరుడు

వెంకటాపూర్ మండలంలోని పాలంపేటలో గల ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయంలో శివలింగానికి ఎదురుగానున్న నందీశ్వరుడే ప్రత్యేక ఆకర్షణ. రాత్రి వేళల్లో నందీశ్వరుడిని చూస్తే సజీవంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆజ్ఞాపిస్తే పరిగెత్తడాని కి సిద్ధంగా ఉన్నట్లుగా నంది కనబడుతోంది. శివ దర్శనం అనంతరం భక్తులు నందీశ్వరుని దర్శించుకొని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. అనంతరం తమ కోరికలను నందీశ్వరుని చెవిలో చెప్పడం ఇక్కడ ఆనవాయితీ.
Similar News
News December 10, 2025
ఏలూరులో AI ల్యాబ్లు: MP

ఏలూరు పార్లమెంట్ పరిధిలో 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 4 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ కంప్యూటర్ ల్యాబుల ఏర్పాటుకు MP పుట్టా మహేశ్ కుమార్ చర్యలు చేపట్టారు. ఏఐ కంప్యూటర్ ల్యాబుల ఏర్పాటు ఖర్చు సమకూర్చాలని ONGC సంస్థతో మాట్లాడి ఒప్పించినట్లు పేర్కొన్నారు. MP విజ్ఞప్తి మేరకు CSR కింద ఏఐ కంప్యూటర్ ల్యాబుల ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు.
News December 10, 2025
ఎన్నికల రోజు స్థానిక సెలవు: జిల్లా కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లాలో మూడు విడతలుగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంతో ఆయా మండలాల్లో పోలింగ్ రోజు స్థానిక సెలవులు ఇవ్వనున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే పేర్కొన్నారు. డిసెంబర్ 11, 14, 17న పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయా మండలాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. మొదటి విడతలో 5 మండలాల పాఠశాలకు సెలవులు ప్రకటించారు.
News December 10, 2025
కృష్ణా: 1500కి పైగా ప్రమాదాలు.. కారణం అదేనా..?

భారీ లోడుతో, ఫిట్నెస్ లేని వాహనాల కారణంగా ఈ ఏడాది ఉమ్మడి కృష్ణాలో 1500కు పైగా ప్రమాదాలు జరిగాయి. వీటిని తనిఖీ చేసి సీజ్ చేయాల్సిన రవాణా శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు సేఫ్టీ అధికారులు మామూళ్ల మత్తులో ఉండి వాహనాలను పట్టిపట్టనట్లు వదలడంతోనే అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


