News April 16, 2025
రామప్పకు ప్రపంచ సుందరీల బృందం: కలెక్టర్

ప్రపంచ గుర్తింపు పొందిన రామప్పను సందర్శించడానికి మే 14న మిస్ వరల్డ్ టీం రాబోతుందని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనే పలు దేశాల మహిళలు రామప్పను సందర్శించనున్నారన్నారు. రోడ్డు, పెయింటింగ్, పర్యాటక పర్యాటకులను ఆకట్టుకునేలా ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News December 4, 2025
అన్నమయ్య: రైలు పట్టాలపై యువకుల మృతి

అన్నమయ్య జిల్లా కలికిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. రైలు పట్టాలపై మృతదేహాలు ఉన్నట్లు తిరుపతి-నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్ లోకో ఫైలట్ మదనపల్లె రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతులు సోమల(M) ఇరికిపెంటకు చెందిన ముని కుమార్, కలికిరి(M) ఆచార్ల కొత్తపల్లికి చెందిన వీర భద్రయ్యగా గుర్తించారు. సెంట్రల్ ట్రాక్‌పై కూర్చొని మద్యం తాగుతున్న సమయంలో రైలు ఢీకొనడంతో చనిపోయారని సమాచారం.
News December 4, 2025
2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. అప్లై చేశారా?

RRBలో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు ఈ నెల 10 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు DEC 12వరకు చెల్లించవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, B.Sc ఉత్తీర్ణులై, 18- 33 ఏళ్ల మధ్య ఉండాలి. స్టేజ్ 1, స్టేజ్ 2 రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. www.rrbcdg.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 4, 2025
భారీ జీతంతో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలు

<


